ఈ విషయం మన అందరికి బాగా తెలుసు. సాధారణంగా స్టార్ హీరోస్ తో నటించాలి అంటూ హీరోయిన్స్ ఆశ పడుతూ ఉంటారు. అలాంటి అవకాశం వస్తే చచ్చినా అస్సలు మిస్ చేసుకోరు.  వాళ్ళకున్న క్రేజ్ కావచ్చు..పబ్లిసిటీ కావచ్చు..పాపులారిటీ ఆధారంగా కావచ్చు ..లేకపోతే మరి ఏ కారణంగా అయినా కావచ్చు .. అలా స్టార్ హీరోలతో నటిస్తే వాళ్ళ క్రేజ్ మరింత పెరిగిపోతుంది అన్న ఆశలు చాలామంది హీరోయిన్స్ కి ఉంటాయి.

అయితే ఇక్కడ మాత్రం అంతా రివర్స్ అయిపోయింది. ఒక యంగ్ హీరోయిన్ తో నటించాలి అంటూ ఆశపడుతున్నారు సీనియర్ హీరో వెంకటేష్ . ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గానే "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విక్టరీ వెంకటేష్ .. ఇప్పుడు వరుసగా సక్సెస్ మీట్ లో పాల్గొంటున్నారు. తనదైన స్టైల్ లో సినిమాకి మంచిగా కూడా కలెక్షన్స్ రాబట్టే విధంగా మార్చుకున్నాడు . అయితే విక్టరీ వెంకటేష్ తో నటించాలి అని చాలామంది హీరోయిన్స్ కి ఉంటుంది .

కానీ విక్టరీ వెంకటేష్ ఒక హీరోయిన్ తో నటించాలి అని ఆ శపడుతున్నాడట . ఆమె మరి ఎవరో కాదు. టాలీవుడ్ మహానటి గా పాపులారిటీ సంపాదించుకున్న "కీర్తి సురేష్".  ఎస్ కీర్తి సురేష్ తో  స్క్రీన్ షేర్ చేసుకోవాలి అంటూ ఆశపడుతున్నారట విక్టరీ వెంకటేష్. కీర్తి సురేష్ నటించిన సినిమా "మహానటి" చూసిన తర్వాత ఆయన ఇలా డిసైడ్ అయ్యారట . ఆమె నటన ఆమె ఎక్స్ప్రెషన్స్ ఆమె హావభావాలు చాలా చాలా నచ్చేసాయట . ఆ కారణంగానే ఒక్కసారైనా సరే కీర్తి సురేష్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నారట . మరి వెంకటేష్ కోరిక తీర్చే డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడో ..? ఆ టైం ఎప్పుడు వస్తుందో..? అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు..!



మరింత సమాచారం తెలుసుకోండి: