ముఖ్యంగా తన కుమారుడు హీరోగా గుర్తింపు తెచ్చుకోకపోవడానికి కుట్ర జరిగిందని ఆరోపణలను కూడా తెలిపారు. గిరిబాబు కొడుకు ప్రభు బాబు ప్రస్తుతం అయితే హాస్యనటుడుగా కొనసాగుతున్నారు. అయితే ఈయనకు ఇంకొక కుమారుడు బోసు బాబు కూడా ఉన్నారు. ఈయన ఇంద్రజిత్తు సినిమాను గిరి బాబాయ్ తెరకెక్కించారట. అప్పట్లో సుమారుగా 45 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి తీశామని.. తన కొడుక్కి నటన అంటే చిన్న వయసు నుంచి ఇష్టం ఉండడంతో బోస్ బాబుని హీరోగా పరిచయం చేశామని తెలిపారు.
అప్పట్లోనే కౌబాయ్ సినిమా ఇంద్రజిత్తును 45 లక్షలు పెట్టి తీశాము దర్శకత్వం కూడా తానే చేశానని తెలిపారు. ఇందులో చాలామంది నటీనటులు సీనియర్ నటించారని కానీ కొంతమంది జిత్తుల వారి వ్యక్తులు ఎత్తులు పై ఎత్తులు వేయడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఈ సినిమా విడుదలైన నెలకే చిరంజీవి నటించిన కొదమ సింహం రిలీజ్ కావాల్సి ఉందని ఇందులో కూడా చిరంజీవి కౌబాయ్ గానే నటించారని తెలిపారు గిరిబాబు. అప్పట్లో హైదరాబాదులోని సెన్సార్ జరిగింది. సెన్సార్ జరుగుతున్న సమయంలో ఇంద్రజిత్తు సినిమాను చూసి సర్టిఫికెట్ రాకుండా ఆపించారని.. ఇంద్రజిత్ సినిమా విడుదలైన 30 రోజుల తర్వాత రిలీజ్ కావాల్సిన కొదమ సింహం చిత్రాన్ని ముందుగానే విడుదల చేయగా ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందని తెలిపారు.. దీంతో తమ సినిమా కోసం బేరాలు సాగించారు కేవలం 20 లక్షల రూపాయలకే అమ్మాము.. సినిమా కొన్న వారందరికీ కూడా మంచి లాభాలను తెచ్చి పెట్టింది. అయినా కూడా ఇంద్రజిత్తు సినిమాని ఫ్లాప్ అంటూ ప్రచారం చేశారని.. చిరంజీవి సినిమా ఫ్లాప్ అయ్యిందని తమ సినిమా హిట్ అయితే బాగోదని అలా ప్రచారం చేశారని తెలిపారట .దీంతో తన కుమారుడు రెండు మూడు సినిమాలు చేసి ఇక వద్దని చెప్పారట.