టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డ్ రావడం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగించిందనే సంగతి తెలిసిందే. సినిమా రంగానికి బాలయ్య చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం బాలయ్యకు ఆ అవార్డును ప్రకటించడం జరిగింది. ఈ అవార్డ్ విషయంలో బాలయ్య నుంచి తాజాగా స్పందన వెలువడగా ఆ స్పందన సోషల్ మీడియా వేదికగా ఒకింత హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.
 
బాలయ్య మాట్లాడుతూ నాకు పద్మభూషణ్ అవార్డ్ ప్రకటించిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు అని బాలయ్య కామెంట్లు చేశారు. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో పాలు పంచుకున్న తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు, కుటుంబ సభ్యులకు యావత్ చలన చిత్ర రంగానికి నా ధన్యవాదాలు అని బాలయ్య పేర్కొన్నారు.
 
నా వెన్నంటే ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న నా అభిమానులకు, నాపై విశేష ఆదరాభిమానులు కురిపిస్తున్న ప్రేక్షకులకు సదా రుణపడి ఉంటానని బాలయ్య వెల్లడించారు. కేంద్రం బాలయ్యకు పద్మభూషణ్ ప్రకటించడంపై సినీ, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మరి కొందరు నటులు బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే.
 
పద్మ అవార్డులకు ఎంపికైన వాళ్లకు నెటిజన్లు సైతం శుభకాంక్షలు తెలియజేస్తూ ఉండటం గమనార్హం. బాలయ్య ప్రస్తుతం అఖండ2 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరో బాలకృష్ణ తర్వాత సినిమాలతో సైతం సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా ఈ హీరో కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి. స్టార్ హీరో  బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు.


 


మరింత సమాచారం తెలుసుకోండి: