పాన్ ఇండియా హీరో ప్రభాస్ కి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్నాం. మరీ ముఖ్యంగా రెబెల్ హీరో పెళ్లి వార్త వినాలి అని జనాలు చాలామంది ఆశపడుతున్నారు. అయితే ఆ పెళ్లి వార్తపై మాత్రం ప్రభాస్ ఏ విధంగా నోరు విప్పడం లేదు . ఎప్పుడు విప్పుతాడు అంటూ ఫ్యాన్స్ రోజు రోజుకి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా ప్రభాస్ ఆ విషయం బయట పెట్టకుండా సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఎక్కువగా ఇస్తూ ఉండడం ఫ్యాన్స్ కి ఒక పక్క ఆనందాన్ని కలుగజేస్తున్న .. మరొక పక్క మాత్రం ప్రభాస్ పెళ్లి వార్త వినాలి అన్న కోరిక అలాగే ఉండిపోయింది.
అయితే రీసెంట్గా ప్రభాస్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. పాన్ ఇండియా లేవల్ లో పాపులారిటి సంపాదించుకున్న హీరో ప్రభాస్ కి సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవాలని జనాలు ఆశపడుతూ ఉంటారు . అయితే ప్రభాస్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి ..? అంటే అందరికీ తెలుసు. " బిర్యాని ..గోంగూర రొయ్యలు". అయితే ప్రభాస్ కి అస్సలు ఇష్టం లేని ఫుడ్ ఏంటి..? అనేది చాలా తక్కువ మందికే తెలుసు .
ఈ విషయాన్ని చాలా తక్కువ సందర్భాలలోనే ప్రభాస్ బయటపెట్టాడు. ఆ విషయం ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. సాధారణంగా ప్రభాస్ కి ఏ కూర అలా తినడమే ఇష్టం అంట . కొందరు మిక్స్డ్ కర్రీస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు . మిగిలిపోయిన కాయగూరలు అన్ని వేసేసి కొన్ని కర్రీస్ చేస్తుంటారు.. లేదంటే చికెన్ - మటన్ - రొయ్యలు -చేపలు వేసి పులావ్ ..ఇలాంటివి చేస్తూ ఉంటారు . అలా డబల్ డబల్ మిక్స్ వెజిటేబుల్స్ కర్రీ అన్న ఏవైనా రెండు రకాల నాన్ వెజ్ ఐటమ్స్ మిక్స్ చేసి వండిన ప్రభాస్ కి అస్సలు ఇష్టం ఉండదట. అలాంటివి చూస్తేనే ఆయనకి వాంతింగ్ వచ్చేస్తుందట . చాలామందికి ఈ హ్యాబిట్ ఉంటుంది . రకరకాల ఎక్స్పరిమెంట్స్ చేసే క్రమంలో ఎక్కువగా ఇలా మిక్సడ్ కర్రీస్ చేస్తూ ఉంటారు . ప్రభాస్ కి అలా అస్సలు ఇష్టం లేదట..!