జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సుమారుగా 10 ఏళ్లకు పైగా కష్టపడి చివరికి 2024 ఎన్నికలలో కూటమిలో భాగంగా పార్టీని విజయాలను అందించారు. కూటమిలో హిందుత్వాన్ని వినిపిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొన్ని పనులు చేయడం వల్ల కొన్ని సార్లు పవన్ కళ్యాణ్ వివాదాస్పదంగా కూడా మారుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే చాలామంది పవన్ కళ్యాణ్ ని విమర్శించడం జరిగింది. తాజాగా ప్రముఖ నిర్మాతలలో ఒకరైన చిట్టిబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు.


ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న త్రిపురనేని చిట్టిబాబు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ రాజకీయాలు అంటే కేవలం పవన్ కళ్యాణ్ తోనే ముడి పెడుతూ ఉంటారు. పవన్ దేముంది లోకేష్ కు పవన్ వల్ల నలిగిపోతారని.. రాబోయే రోజుల్లో లోకేష్ ,జగన్ మధ్య పవన్ ఎలా నలిగిపోతారో .. ఇవాళ మాట్లాడింది రేపు ఆయన మాట్లాడరని రోజుకొక మాట మాట్లాడుతూ ఉంటారని ఆయన ఒక పొలిటికల్ జోకర్ గా ఉన్నారని తెలిపారు చిట్టిబాబు.


ప్రస్తుతం పవర్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ అంటున్నారు.. లేకపోతే పొలిటికల్ జోకర్ అంటారని.. ముఖ్యంగా సిజ్ ద షిప్ అని ఎన్నోసార్లు అనడం.. అప్పుడు కూడా జోకర్ అయ్యారని.. ఇవే కాకుండా పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు 32 వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారని.. ఇప్పుడు వారి గురించి అసలు మాట్లాడలేదని తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రజలకు ఎన్నోసార్లు క్షమాపణలు చెప్పాలి అంటూ తెలిపారు. అమ్మాయిలు మిస్ అయ్యారని విషయం పైన, అలాగే ప్రజలకు ఇచ్చిన హామీల పైన కూడా చెప్పాలి, ఆంధ్రకు ద్రోహం చేసింది బిజెపి అనే విషయం పైన కూడా చెప్పాలి, మొన్న గేమ్ ఛేంజెర్ ఫంక్షన్ లో కూడా యువతను రెచ్చగొట్టి బైకులు రేసులు అంటూ రెచ్చగొట్టారు ఇలా ఎన్నో క్షమాపణలు చెప్పాలి అంటే తెలిపారు చిట్టిబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: