తమిళ హీరో ప్రసన్నతో ప్రేమ పెళ్లి, ఇద్దరు పిల్లలు.. ఆ తర్వాత ఫ్యామిలీ లైఫ్ లో బిజీ అయిపోయింది. కానీ స్నేహా తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టి అదరగొడుతోంది. ఇప్పుడు అక్కగా, వదినగా క్యారెక్టర్ రోల్స్ తో కూడా ఆడియన్స్ ని ఫిదా చేస్తోంది. తెలుగులో చివరిసారిగా 2019లో వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో కనిపించింది. 2015లో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో యాక్ట్ చేసి మెప్పించింది.
ఇప్పుడేమో బిజినెస్ ఉమెన్‌గా మారిపోయింది స్నేహా. చెన్నైలో "స్నేహాలయం" పేరుతో చీరల షోరూమ్ స్టార్ట్ చేసింది. డిజైనింగ్‌లోనూ తన మార్క్ చూపిస్తూ, కస్టమర్ టేస్ట్ కి తగ్గట్టు లేటెస్ట్ ట్రెండ్స్ అందిస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు బిజినెస్ లేడీ.. స్నేహా ప్రయాణం మాత్రం సూపర్ ఇంట్రెస్టింగ్ అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.