నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా అనంతరం వరుస పెట్టి సినిమాలలో నటించి ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకుంది. చలో సినిమా తర్వాత ఈ బ్యూటీ చేసిన సినిమాలన్నీ మంచి సక్సెస్ అందుకున్నాయి. రీసెంట్ గా పుష్ప సినిమాతో రష్మిక ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు చేరువైంది. ఈ సినిమాలో తన నటనను చూసి ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపించారు.


అల్లు అర్జున్ కు భార్య పాత్రలో రష్మిక మందన చాలా అద్భుతంగా నటించింది. రష్మిక నటనతో ఈ సినిమా మరింత సక్సెస్ అందుకుందని చెప్పవచ్చు. పుష్ప-2 సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న రష్మిక ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.  కాగా, కొద్దిరోజుల క్రితమే రష్మిక కాలు బెనికింది. జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న సమయంలో రష్మిక కాలు బెనికింది.


అప్పుడు కేవలం చిన్న గాయమే అని రష్మిక అనుకుందట. తర్వాత కాలుకి లోపలి భాగంలో దెబ్బ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం రష్మిక వీల్ చైర్ పైనే ఉంటుందట. కాగా రష్మిక చేసిన కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాలలో సక్సెస్ అవ్వడానికి తన సమయాన్ని కుటుంబంతో కేటాయించడంలో రాజీ పడినట్టుగా హీరోయిన్ రష్మిక వెల్లడించారు. వృత్తిపర, వ్యక్తిగత విషయాలకు ఒకేసారి సమయాన్ని కేటాయించడం చాలా కష్టమని రష్మిక అన్నారు.


కుటుంబమే తన బలం అని, ముఖ్యమైన సమయాలలో కుటుంబంతోనే సమయాన్ని గడుపుతానని రష్మిక వెల్లడించారు. షూటింగ్స్ లో బిజీగా ఉండడం వల్ల తనకు ఇష్టమైన తన చెల్లిని ఎంతగానో మిస్ అయ్యానని రష్మిక చెప్పారు. కాగా, రష్మిక నటించిన చావా మూవీ ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం నాడు థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం రష్మిక అభిమానులు ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: