యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2019 సంవత్సరంలో "రాజావారు రాణి గారు" సినిమాతో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. ఆ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. అనంతరం 2021లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కోవిడ్ అనంతరం థియేటర్లకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చిన ఎస్ఆర్ కళ్యాణమండపం చిన్న సినిమాగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

అనంతరం 2022లో కాన్సెప్ట్ బేస్డ్ థ్రిల్లర్ "సెబాస్టియన్ పిసి 524" సినిమాలో రేచీకటి ఉన్న పోలీసు ఆఫీసర్ పాత్రను పోషించారు. అనంతరం "క" సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. గత సంవత్సరం రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా విజయంతో కిరణ్ అబ్బవరం తన రెమ్యూనరేషన్ భారీగా పెంచేశాడని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి.


ప్రస్తుతం కిరణ్ అబ్బవరం రూ. 5 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడట. "క" సినిమాతో కిరణ్ అబ్బవరంకు డిజిటల్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. దానిని దృష్టిలో ఉంచుకొని రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. అతను అడిగింది ఇవ్వడానికి నిర్మాతలు సైతం రెడీగా ఉన్నారు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. ఎస్.కే.ఎన్, సాయి రాజేష్ బ్యానర్ లో కిరణ్ అబ్బవరం ఓ సినిమా చేయబోతున్నాడు.


అంతేకాకుండా రాజేష్ దండ నిర్మాణంలో మరో సినిమా కూడా తీస్తున్నాడు. "క 2" సినిమా కథ కూడా సిద్ధమవుతోంది. అంతేకాకుండా మరో ఇద్దరు కొత్త దర్శకుల కథలకు అబ్బవరం ఓకే చెప్పాడు. తాను నటించిన దిల్ రూబా సినిమా ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో ఏ విధంగా అభిమానులను అలరిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: