ఇక ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన కొత్త సినిమాలు ఏంటో తెలుసుకుందాం. అలాగే వాటిలో ఈ వీకెండ్ కి చూడాల్సిన బెస్ట్ మూవీస్ కూడా ఏం ఉన్నాయో చూద్దాం.
ఇక ఈ వారం మూవీ లవర్స్ కు పండగే పండగ అనే చెప్పాల్సిందే. ఎందుకంటే ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవే.. ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన జీ5 లో స్టార్ హీరో ఆర్ మాధవన్ నటించిన హిసాబ్ బరాబర్ అనే వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యింది. ఈ సిరీస్ లో మాధవన్ రైల్వే టికెట్ కలెక్టర్ రాధే మోహన్ శర్మగా మెయిన్ లీడ్ రోల్ చేశారు. ఈ సిరీస్ బ్యాంక్ క్రైమ్ నేపథ్యంలో సాగుతుంది. ఈ సిరీస్ తెలుగుతో పాటుగా హిందీ, తమిళం భాషల్లో కూడా ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
అలాగే రాగ్ మయూర్ మెయిన్ లీడ్ రోల్ చేసిన సివరపల్లి కామెడీ వెబ్ సిరీస్ కూడా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ లో మురళీధర్ గౌడ్, రూప లక్ష్మి, ఉదయ్ గుర్రాల, సన్నీ పల్లె, పావని కరణం నటించారు. ఇక అమోల్ పరాషర్, హీరోయిన్ మిథిలా పాల్కర్ జంటగా నటించిన రొమాంటిక్ సినిమా స్వీట్ డ్రీమ్స్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ అయ్యింది.
ఇదిలా ఉండగా.. ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ లో లెబనీస్ ఫ్యామిలీ సర్వైవల్ థ్రిల్లర్ ది సాండ్ కాస్టెల్ కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే సీజన్ 1 పూర్తి చేసుకున్న యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ది నైట్ ఏజెంట్ సీజన్ 2 నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఇక ఈ 5 వెబ్ సిరీస్ లు ఈ వీకెండ్ కు ఓటీటీలో వీక్షించి ఎంజాయ్ చేయండి.