బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఈయన దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న హీరో.. అయితే అలాంటి ఈ హీరోని చూసి గే అని ఆ హీరో అత్త అనడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.అయితే అక్షయ్ కుమార్ ని గే అని వాళ్ళ అత్త ఎందుకు అందో ఇప్పుడు చూద్దాం. అక్షయ్ కుమార్ ట్వింకిల్ ఖన్నా ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పరిచయం ఎలా కుదిరింది అంటే అవుట్ డోర్ షూటింగ్ కోసం బయటికి వెళ్లిన సమయంలో అక్కడ టీవీ లేకపోవడంతో బోర్ కొట్టిందట ట్వింకిల్ ఖన్నాకి. ఆ సమయంలో బుక్స్ చదివి చదివి బోర్ కొట్టడంతో అక్కడే ఉన్న అక్షయ్ కుమార్ తో పరిచయం ఏర్పడింది. 

అలా 15 రోజుల్లో వీరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారిందట.అయితే మొదట పెళ్లి చేసుకుందామని అక్షయ్ కుమార్ ట్వింకిల్ ఖన్నాని అడిగారట.కానీ ఈ విషయం ట్వింకిల్ ఖన్నా తల్లి కూడా చెప్పిందట. అయితే ఇక్కడో ఓ ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఓ రోజు అక్షయ్ కుమార్ ని ఇంటికి తీసుకువెళ్లి మరీ తన తల్లికి పరిచయం చేసిందట ట్వింకిల్ ఖన్నా.ఆరోజు అక్షయ్ కుమార్ వెళ్లడంతోనే నాకు అక్షయ్ ని చూస్తే గే లా అనిపిస్తుంది. అందుకే నువ్వు ఒక సంవత్సరం పాటు ఆయనతో సహజీవనం చేయి,నమ్మకం కుదిరితేనే పెళ్లి చేసుకో అని చెప్పిందట.

 ఇక తల్లి మాటలకు మొదట షాక్ అయిపోయిన ట్వింకిల్ ఖన్నా తల్లి ఇష్ట ప్రకారమే అక్షయ్ కుమార్ తో దాదాపు వన్ ఇయర్ డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.అయితే ఈ విషయాన్ని రీసెంట్ గా ట్వింకిల్ ఖన్నా కాఫీ విత్ కరణ్ అనే టాక్ షోలో బయట పెట్టింది. ఇక అక్షయ్ కుమార్ ట్వింకిల్ ఖన్నా కంటే ముందు రవీనా టాండన్ ని ప్రేమించారు. కానీ వీరిద్దరూ పెళ్ళి వరకు వెళ్ళాక ట్వింకిల్ ఖన్నా మధ్యలోకి వచ్చి వీరి మధ్య ప్రేమని చెడగొట్టింది అనే టాక్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: