టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అంటే ఒక ఫేమ్ ఉంది. విజయ్, అర్జున్ రెడ్డి మూవీతో అందరినీ తన వైపుకి తిప్పుకున్నాడు. ఆ సినిమాతో మంచి హిట్ అందుకొని.. ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఇక ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ సినిమాలలో చాలా తక్కువగా కనిపిస్తున్నాడు. ఫ్యామిలీ మ్యాన్ సినిమా తర్వాత విజయ్ అసలు సినిమాలలో కనిపించలేదు. ఇదిలా ఉండగా.. విజయ్ ఇప్పటికే గౌతమ్ తిన్ననూరితో ప్రాజెక్ట్ చేస్తున్నాడు.
ఇక VD 14 సినిమా రాహుల్ సంకృత్యాన్ తో చేయనున్నాడు అని సమాచారం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ , విజయ్ దేవరకొండతో చేయబోయే మూవీకి ఇప్పటికే హైప్ పెంచేశాడు. నేడు రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా ప్రారంభానికి పూజ కార్యక్రమాలు చేశారు. సినిమా సెట్ వర్క్స్ కోసం మొదటి ఇటుకని కూడా పెట్టారు అంట. అయితే ఈ సినిమా కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసేలా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం భారీ సెట్లు పెడుతున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. ఇంత వరకు ఇండియన్ స్క్రీన్ ఎవ్వరూ చెప్పని, చూపించని కథను, చరిత్రను డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం వస్తుంది.
సినిమా హీరోయిన్ గా రష్మిక ను తీసుకుంటునట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్  కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. ఈ సినిమాకు బాలీవుడ్ ద్వయం అజయ్ అతుల్ సంగీతాన్ని అందిస్తున్నారు అంట. ఇక రౌడీ బాయ్ వరుస హిట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రానున్నట్లు టాక్ వినిపిస్తుంది. అందరిలా మామూలు స్టోరీలతో రౌడీ బాయ్ రాడని.. అన్నీ డిఫరెంట్ మూవీస్ తోనే వస్తాడని అభిమానులు ఈ విషయాన్ని తెగ వైరల్ చేస్తున్నారు. ఇక రౌడీ హీరో ఈ సారి ఎన్ని హిట్ లు కోడతాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: