మాస్ మహారాజ్ రవితేజ హీరో గా వస్తున్న మాస్ జాతర మూవీకి సంబంధించిన గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. భాను భోగవరపు దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం మాస్ జాతర మనదే ఇదంతా అనే ట్యాగ్ లైన్ తో వస్తోంది.ఇదిలావుండ గా రవితేజ పుట్టిన రోజు సందర్భం గా ఈ మూవీకి సంబంధించిన వీడియో గ్లింప్స్ ను విడుదల చేశారు. ఇందు లో ఎప్పటిలాగానే రవితేజ తన ఎనర్జిటిక్ యాక్టింగ్, కామెడీ ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టాడు. విక్రమార్కుడు లెవల్లో మాస్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఈసారి రవితేజ అభిమానులకు నిజంగానే మాస్ జాతర ఉండేలా ఉందని నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. మే 9న మాస్ జాతర థియేటర్ల ముందుకు రానుంది.ఈ క్రమంలో మాస్  ఇమేజ్ తెచ్చుకున్న ప్రతి హీరో కెరీర్లో ఒక్కసారైనా పోలీస్ పాత్ర చేయాలని అనుకుంటాడు. ఆ పాత్రల్లో ఉండే హీరోయిజం వేరు. వాటికి పడే ఎలివేషన్లు వేరు.టాలీవుడ్లో ఖాకీ పాత్రల్లో అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చి మరపురాని విజయాలు అందుకున్న హీరో ల్లో మాస్ రాజా రవితేజ ఒకడు. అతను విక్రమార్కుడు, పవర్, క్రాక్ సినిమా ల్లో పోలీస్ పాత్రలను ఎంత గొప్పగా పండించాడో అవి ఎంత పెద్ద విజయాలు సాధించాయో తెలిసిందే. మాస్ రాజా పోలీస్ పాత్రలు చేసిన సినిమాల్లో ఒక్క టచ్ చేసి చూడు మాత్రమే సరిగా ఆడలేదు. చివరగా క్రాక్ సినిమాలో పోలీస్ పాత్రను గొప్ప గా పండించాడు మాస్ రాజా. ఇప్పుడు మళ్లీ అతను ఖాకీ చొక్కా తొడిగాడు.ఇదిలావుండగా ఈ సినిమా కోసం లుక్ మీద మాస్ రాజా ప్రత్యేక దృష్టి పెట్టినట్లే కనిపిస్తోంది ఈ పోస్టర్ చూస్తుంటే. రవితేజ ఖాకీ డ్రెస్ వేశాడంటే పెర్ఫామెన్స్ అదిరిపోతుందనడం లో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: