టాలీవుడ్ హీరో మాస్ మహారాజు రవితేజ గురించి పరిచయం అనవసరం. హీరో రవితేజ సినీ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాడు. అతనే బ్యాక్ గ్రౌండ్ లేని వారందరికీ బ్యాక్ గ్రౌండ్ గా నిలిచాడు. రవితేజ అంటే అభిమానం లేని వారంటూ ఉండరు. అంచెలంచెలుగా ఎదిగి మాస్ మాహారాజాగా ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్నాడు. నేడు ఆయన పుట్టిన రోజు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు మాస్ మహారాజు రవితేజ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ క్రమంలో డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. అందులో రవి తేజకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 'నేను హీరో రవితేజ తో మూడు సినిమాలు చేశాను. మిరపకాయ్ ఇచ్చినా, మిస్టర్ బచ్చన్ ఇచ్చినా... అభిమానంలో ఆవగింజంత అయినా తేడా చూపని మా మాస్ మహారాజు రవితేజ అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు, లవ్ యూ ఫర్ ఎవర్ అన్నయ్య' అంటూ హరీష్ శంకర్ రాసుకొచ్చారు.
ఇక ఈ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే రవితేజ, శంకర్ కాంబోలో తెరకెక్కిన మిరపకాయ సినిమా సూపర్ హిట్ కొట్టి.. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ శంకర్, రవితేజ కలిసి తీసిన షాక్ సినిమా అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇదిలా ఉండగా.. ఇటీవల మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మిస్టస్ బచ్చన్ మూవీ కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే మిస్టర్ బచ్చన్ వంటి ప్లాప్ మూవీని ఇచ్చినప్పటికి కూడా రవితేజ తనపై చూపించే అభిమానంలో ఏ మాత్రం కూడా తేడా లేదని ఆయన చెప్పుకొచ్చారు. హీరో రవితేజ చిన్న చిన్న పాత్రలలో నటిస్తూనే.. పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకొని స్టార్ హీరోగా ఎదిగిన సంగతి అందరికీ తెలిసిందే.