టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ట్రెండ్‌ సెట్‌ చేసే సినిమాలు తీసిన రామ్‌గోపాల్‌ వర్మ  రానురానూ గతి తప్పాడు. చౌకబారు సినిమాలు తీసుకుంటూ పోయాడు. కానీ ఈ మధ్యే వర్మకు తను చేసిన తప్పు అర్థమైంది.సత్య సినిమా చూసాక తనకు బుద్ధి వచ్చిందని, ఇక నుంచి తాను దర్శకుడిగా చెప్పుకొనే సినిమాలు తీస్తానని ప్రతిజ్ఞ చేశాడు.అందుకు తగ్గట్టుగానే సిండికేట్ అనే చేస్తున్నట్లు తెలిపాడు. ఒక్క మనిషి మాత్రమే అత్యంత భయంకరమైన జంతువు కాగలడు అనే లైన్ తో ఈ కథ నడుస్తుందని, సిండికేట్ అనేది సుదూర భవిష్యత్తులో సెట్ చేయని భవిష్యత్ కథ అని చెప్పుకొచ్చాడు.సిండికేట్ ఎలాంటి సూపర్ పవర్స్ లేని చాలా ప్రమాదకరమైన సినిమా. కానీ, ఒక మనిషి భయంకరంగా ఏమి చేయగలడు అని చూపిస్తుందని, ఈ చిత్రం క్రైమ్ మరియు టెర్రర్ యొక్క స్వభావాన్ని లోతుగా చూపిస్తుందని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ సినిమాపై అభిమానులు అప్పుడే అంచనాలను పెట్టేసుకుంటున్నారు. ఒక సత్య, ఒక సర్కార్ లా ఈ సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డాడు వర్మ. ఎప్పుడైతే ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశాడో అప్పటి నుంచి ఇందులో నటించే స్టార్స్ గురించి రూమర్స్ మొదలయ్యాయి.

సిండికేట్ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, విక్టరీ వెంకటేష్, విజయ్ సేతుపతి తదితరులు నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సిండికేట్ సినిమాను సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో దగ్గుబాటి సురేష్ బాబు నిర్మిస్తున్నట్లు కూడా టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ స్టార్ హీరోలతో వర్మ సంప్రదింపులు జరిపాడని, వారు కూడా కథ నచ్చి ఓకే చెప్పారని కూడా చెప్పుకొస్తున్నారు . ఇక ఈ వార్తలపై ఎట్టకేలకు వర్మ స్పందించాడు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలలో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చాడు. సిండికేట్ లో ఎలాంటి స్టార్ హీరోస్ ను తాను అనుకోలేదని చెప్పుకొచ్చాడు.ఎలాగైనా ఈసారి వర్మ తనలో ఉన్న వింటేజ్ డైరెక్టర్ ను నిద్రలేపాలని చూస్తున్నాడు. సిండికేట్ సినిమాతో తన సత్తా చూపించాలని ఆరాటపడుతున్నాడు. మరి వర్మ అనుకున్నది సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: