సాధారణంగా ఏదైనా ఒక సినిమా సక్సెస్ అయ్యిందంటే ఆ సినిమా సీక్వెల్లో అదే హీరోయిన్ నటింపజేయాలని చూస్తూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో సీక్వెల్ కి కొత్త హీరోయిన్ ని చేంజ్ చేస్తూ ఉన్నారు. అలా బాలక్రిష్ణ నటిస్తున్న అఖండ 2 చిత్రానికి హీరోయిన్గా అందరూ కూడా ప్రగ్యా జైస్వాల్ నటిస్తుందని అనుకున్నారు. కానీ చిత్ర బృందం నిన్నటి రోజున సడన్ ట్విస్ట్ ఇస్తూ ఇందులో సంయుక్తా మీనన్ నటించబోతుందని తెలియజేశారు. ఇటీవలే గోల్డ్ యాడ్ కూడా సంయుక్త చేసిందని అలాగే ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కూడా చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


అందుకే బహుశా అఖండ 2 సినిమాలో హీరోయిన్ గా సంయుక్తాన్ని తీసుకోవడానికి కూడా ఇదే కారణం అన్నట్లుగా  టాకు వినిపిస్తోంది. ఇప్పటివరకు బాలయ్య తో రెండు చిత్రాలలో నటించిన ప్రగ్యా ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. బాలయ్య, ప్రగ్యా ఇద్దరు కూడా బ్లాక్ బాస్టర్ జోడి అని చెప్పవచ్చు. గతంలో అఖండ, ఇటీవలే డాకు మహారాజు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే ఇప్పుడు అఖండ 2 నుంచి ఈమె తప్పు ఉందా లేకపోతే తప్పించారు అని అనుమానాలు కూడా ఇప్పుడు అభిమానులలో కలుగుతున్నాయట.



ప్రగ్యా ఈ సినిమాలో 17 ఏళ్ల అమ్మాయికి తల్లిగా నటించాలని ఇలా చేస్తే కచ్చితంగా తన ఇమేజ్ దెబ్బతింటుందని భావించి ప్రగ్యా తప్పుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అఖండలో చిన్న పాప పెరిగి పెద్దవుతుందని ఆమెకు సమస్య వస్తే వస్తానని మాట ఇచ్చిన అఖండ మళ్లీ వెనక్కి వచ్చి ఆ సమస్యను ఎలా తీరుస్తారు అనే కథ అంశంతోనే అఖండ 2 రాబోతున్నదట.. అందుకే అంత పెద్ద అమ్మాయికి అమ్మగా చేస్తే కెరియర్లో ఇబ్బందులు వస్తాయని భావించిన ప్రగ్యా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.. మరి సంయుక్త తల్లి పాత్రలో ఎలా సెట్ అవుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: