మెగా హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో రామ్ చరణ్ ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్నాడు. రామ్ చరణ్ తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. హిట్లు, ఫ్లాప్లు అనే తేడా లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.


దాదాపు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. గేమ్ చేంజర్ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించగా.... దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా థియేటర్లలో ఇంకా నడుస్తూనే ఉండగా.... రామ్ చరణ్ తన తదుపరి సినిమా షూటింగ్ ప్రారంభించారు. బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సి16 సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా చేస్తోంది. కాగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ బయటకు వచ్చింది.


ఆర్సి16 సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించబోతున్నారని ప్రచారాలు జరుగుతున్నాయి. ఇదివరకే దర్శకుడు బుచ్చిబాబు హీరో రణబీర్ కు కథను వినిపించగా....అతను ఓకే చెప్పారని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కాగా, రామ్ చరణ్ - జాన్వి కపూర్ నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలకపాత్రలో నటించనున్నట్లుగా సమాచారం సాగుతోంది. ఈ విషయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, రామ్ చరణ్ సినిమాలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నటించబోతున్నారని తెలిసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటుందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: