అందాల భామ అనుపమ పరమేశ్వరన్ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. తన నటన, అందం, కర్లీ హెయిర్ తో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. తన వాయిస్ తో కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేసింది. ఈ ముద్దుగుమ్మ. ప్రేమమ్ సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాలు చేసి అభిమానులను ఆకట్టుకుంది. కొన్నేళ్లపాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించింది. వరుస పెట్టి సినిమాలు చేసింది.


కాగా, గత కొద్ది రోజుల నుంచి ఈ బ్యూటీ సినిమాలు పెద్దగా చేయడం లేదు. కొద్ది రోజుల క్రితం టిల్లు స్క్వేర్ సినిమాలో హీరోయిన్ గా చేసి కుర్రాళ్లకు షాక్ ఇచ్చింది. టిల్లు స్క్వేర్ సినిమాలో తన అందాలను ఆరబోసి నటించింది. ఆ సినిమాలో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలలో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో పరదా అనే సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా తమిళంలో కొన్ని సినిమాలలో నటిస్తోంది. ఈ సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉండగా.... ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.


తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేసుకోవడమే కాకుండా సమయం దొరికినప్పుడల్లా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం తన చేతిలో ఎలాంటి సినిమాలు లేకపోవడంతో ఈ బ్యూటీ తమిళ స్టార్ హీరోతో వెకేషన్ కి వెళ్లినట్టుగా ఓ వార్త వైరల్ గా మారుతుంది.


అతనితో డేటింగ్ చేస్తున్నట్లు, పీకల్లోతు ప్రేమలో మునిగినట్టుగా ప్రచారాలు సాగుతున్నాయి. అంతేకాకుండా వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారట. మరి ఆ హీరో ఎవరు ఏంటి అనే విషయాలు మాత్రం బయటకు రాలేదు. ఈ విషయంపై అనుపమ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: