ఈ తరుణంలోనే హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలయ్యకు కూడా అవార్డు దక్కింది తెలుగులో అగ్ర హీరోగా ఉన్న బాలయ్య ఒక్కడికే ఈ అవార్డు దక్కడం విశేషం. నందమూరి బాలయ్య కు అవార్డు దక్కడంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా పోస్ట్ పెట్టారు. బాల బాబాయ్.. నీకు అవార్డు రావడం చాలా గ్రేట్... ఇది మన కుటుంబానికి గర్వకారణం అన్న రేంజ్ లో జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ పెట్టడం జరిగింది.
అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖులు కూడా నందమూరి బాలయ్యకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే నందమూరి బాలయ్య కు పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం పై వైసీపీ పార్టీ నేతలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. బిజెపి నేతలను అలాగే ప్రధాని నరేంద్ర మోడీని పచ్చి బూతులు తిట్టిన నందమూరి బాలయ్యకు.. పద్మభూషణ్ అవార్డు ఎలా ఇస్తారని... బాలయ్య మాట్లాడిన పాత వీడియోను ట్రెండ్ చేస్తున్నారు వైసిపి నేతలు.
ప్రత్యేక హోదా విషయంలో మోడీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈ వీడియోలో నందమూరి బాలయ్య రెచ్చిపోయారు. ప్రధాని మోడీని ఉద్దేశించి.. దారుణంగా తిట్టారు బాలయ్య. అయితే మోడీని తిట్టిన క్లిప్పు మాత్రమే కట్ చేసి.. బాలయ్యకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. మోడీని తిట్టిన బాలయ్యకు ఎందుకు అవార్డు ఇస్తారని బిజెపి నేతలపై సెటైర్లు పేల్చుతున్నారు.