ఐతే ఈమధ్య స్టార్ సినిమాలన్నీ కూడా రెండు భాగాలుగా వస్తున్నాయి. ఓజీపై ఉన్న అంచనాలు చూస్తే ఈ సినిమాను కూడా రెండు భాగాలు చేసినా చేస్తారని అనుకుంటున్నారు. ఐతే ఓజీని రెండు భాగాలు చేయాలని డైరెక్టర్, ప్రొడ్యూసర్ అనుకుంటున్నా పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు నో చెబుతున్నాడని టాక్. ఇప్పటికే కమిటైన సినిమాల విషయంలో పవన్ కళ్యణ్ డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ఒక్కో సినిమాకు రెండు భాగాలు అంటే మరి కొన్నాళ్లు పనిచేయాల్సి ఉంటుంది.పవన్ కళ్యాణ్ కి ఆ ఇంట్రెస్ట్ లేదన్నట్టు తెలుస్తుంది. ఓజీతో పాటు నాలుగేళ్ల క్రితం మొదలైన హరి హర వీరమల్లు సినిమా మాత్రం రెండు భాగాలుగా వస్తుంది. వీరమల్లు, ఓజీ రెండు సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ పని చూడాల్సి ఉంటుంది. ఓజీ తో పాన్ ఇండియా లెవెల్ లో పవర్ స్టార్ స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. వీరమల్లు సినిమా మార్చ్ ఎండింగ్ కి ప్లాన్ చేస్తుండగా ఓజీ ఎప్పుడు వస్తుంది అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.