పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ సినిమాల పరిస్థితి ఏంటి అనే విషయంపై ఇప్పుడు అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.. తాజాగా వారందరికీ ఒక గుడ్ న్యూస్ వినిపిస్తోంది అల్లు అర్జున్ తదుపరిచిత్రం త్రివిక్రమ్ తోనే ఉంటుంది అంటూ ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తోనే మైథాలజికల్ టచ్ తో ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి నిర్మాత నాగవంశీనే. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో మొదలుపెట్టబోతున్నారు. డైరెక్టర్ సుకుమార్ తో అయిపోయిన వెంటనే ఆ తర్వాత డైరెక్టర్ అట్లీతో ఒక సినిమా ఉంటుందని సమాచారం.
ఇటీవలే అల్లు అర్జున్ అట్లీ కూడా ఎక్కువగా కలుస్తూ ఉన్నారట. ప్రస్తుతం కథ ప్రిపేర్ చేసే పనిలో డైరెక్టర్ అట్లే ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది ఆ తర్వాతే పుష్ప 3 సినిమాని తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయట. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో సినిమా చేయబోతున్నారని సమాచారం. ప్రస్తుతమైతే సుకుమార్ కూడా RC -17 తో బిజీగా ఉండబోతున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో స్పిరిట్ సినిమాని చేయబోతున్నారు. మరి వీళ్లల్లో ఎవరు ముందుగా సినిమా అయిపోయి ఫ్రీ గా ఉంటారో వారు అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశం ఉంటుందట. మొత్తానికి అల్లు అర్జున్ ఒక లైనప్పుతోనే సినిమాలను చేస్తూ ఉన్నారు.