తాజాగా ఇందుకు సంబంధించి టీజర్ ని కూడా చిత్ర బృందం గడిచిన కొన్ని గంటల క్రితం విడుదల చేయగా.. టీజర్ చూస్తూ ఉంటే మొదటి భాగం నుంచి లీడ్ తీసుకునే మరి స్టీఫెన్ గట్టుపల్లి అప్పటి రాజకీయాలను ఎలా మార్చారు అనే కథ అంశంతోనే తెరకెక్కించినట్లు కనిపిస్తోంది.. అలాగే అబ్రహం ఖురేషిగా ఎందుకు మారాడు? అనే అంచనాలు ఈ సినిమాకి భారీ హైప్ పెంచేస్తున్నాయి. ముఖ్యంగా మొదటి భాగం కంటే ఇందులో మరింత చాలా స్టైలిష్ గా మోహన్ లాల్ చూపించారు. మోహన్లాల్ ఇందులో తన వైలెన్స్ తో దుమ్ము దులిపేస్తున్నట్లుగా కనిపిస్తోంది. చివరిగా పృధ్విరాజ్ కుమారన్ నీ చూపించారు.
ఇందులో మంజు వారియర్ తో పాటు ఇంద్రజిత్తు సుకుమారన్ తదితర నటీనటులు నటిస్తూ ఉన్నారు. మలయాళం లో ఒక్కటే మొదటి భాగాన్ని రిలీజ్ చేయగా లూసిఫర్ 2 మాత్రం బాగానే వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారు మార్చి 27న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. గతంలో లూసీఫర్ చిత్రాన్ని గాడ్ ఫాదర్గా చిరంజీవి రీమిక్స్ చేయగా సల్మాన్ ఖాన్ కీలకమైన పాత్రలో నటించారు.. కానీ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయిందనే టాక్ వినిపించింది. మరి ఇప్పుడు వస్తున్న లూసిఫర్ 2 చిత్రాన్ని చిరంజీవి రీమేక్ చేస్తారేమో చూడాలి మరి.