ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు గాని పుష్ప సినిమాకు ముందు అల్లుఅర్జున్ తెలుగులో స్టార్ హీరోగా వున్నారు.. బన్నీ కెరీర్ లో ఎన్నో హిట్స్ తో పాటు ప్లాప్స్ కూడా వున్నాయి.. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా “బద్రినాథ్”..2009 వ సంవత్సరం దర్శకధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన మగధీర ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ అప్పట్లోనే 40 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు…

ఆ సినిమాలో రాంచరణ్ సర్వ సైన్యాధ్యక్షుడిగా, ఒక రాజ్యాన్ని కాపాడే వీరుడిగా అద్భుతంగా నటించాడు..ఈ సినిమాలో రాంచరణ్ లుక్స్ కూడా ఎంతగానో అకట్టుకున్నాయి.. లాంగ్ హెయిర్ తో రాంచరణ్ అదరగొట్టాడు..అలాగే గుర్రపు స్వారీ, భారీ యాక్షన్ ఫైట్స్ ఈ సినిమాకు ప్లస్ గా మారాయి.. అన్నిటికి మించి రాజమౌళి టేకింగ్ ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి..40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.. రాంచరణ్ కెరీర్ లో రెండో సినిమానే 100 కోట్లు రాబట్టడంతో అల్లు అరవింద్ తన తనయుడు అల్లు అర్జున్ తో కూడా అలాంటి సినిమా చేయాలనీ గట్టిగా ఫిక్స్ అయ్యాడు..

మెగాస్టార్ ఇంద్ర సినిమాకు కథ అందించిన చిన్ని కృష్ణ కథ సిద్ధం చేయగా స్టార్ డైరెక్టర్ వి.వి వినాయక్ ఈ సినిమాను తెరకెక్కించేందుకు ఒప్పించారు.. అలా వచ్చిన సినిమానే “బద్రీనాథ్”.. ఈ సినిమాలో హాట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది..పురాతన ఆలయాలను కాపాడే క్షేత్రపాలకుడు తన గురువు కోసం, ఇచ్చిన మాట కోసం ఎంతటి త్యాగాన్ని అయినా చేయగలడో అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది..ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఏకంగా 42 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాడు..ఈ సినిమా 2011 జూన్ 10 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ సినిమా సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి.అలాగే బన్నీ డాన్స్ సైతం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.. తమన్నా గ్లామర్ కూడా ఎంతో అలరించింది.. అయితే ఈ సినిమా మగధీర సినిమాకు రిఫరెన్స్ లా వచ్చిందని అంతా భావించారు..

మగధీర సినిమాకు కాపీ అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.. దీనితో సినిమా స్టోరీ సైతం అంత గొప్పగా లేకపోవడంతో ఈ సినిమా ఓ మోస్తరు విజయం అందుకుంది..బద్రీనాథ్ కోసం బన్నీ బాగా కష్టపడ్డాడు. డాన్స్ మూమెంట్స్, బాడీ బిల్డింగ్ కోసం బాగా కష్టపడ్డాడు.. కానీ ఈ సినిమా టోటల్ రన్ లో కేవలం 30 కోట్లు మాత్రమే రాబట్టి అల్లుఅరవింద్ కి 10 కోట్లకు పైగా నష్టాలు మిగిల్చింది.. అప్పటి నుంచి అల్లుఅరవింద్ భారీ బడ్జెట్ సినిమాలంటే ఆచితుచి అడుగులు వేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: