తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నిర్మాతలలో టీజీ విశ్వప్రసాద్ ఒకరు. ఈయన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈయన గత కొంత కాలంగా సినిమాలను నిర్మిస్తూ వస్తున్నాడు. జెట్ స్పీడు లో ఈ నిర్మాత సినిమాలను నిర్మిస్తూ ఆ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న ఆ సినిమాలు అంతే స్పీడుగా థియేటర్లోకి వచ్చి వెళ్ళిపోతున్నాయి. ఈయన బ్యానర్ నుండి వచ్చిన సినిమాలలో చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సందర్భాలు ఉన్నాయి.

ఇకపోతే ఈ నిర్మాతకు పెద్ద మొత్తంలో నష్టాలను తీసుకువచ్చిన సినిమాలలో ఓ రెండు సినిమాలు ప్రధమంగా నిలిచినట్లు తెలుస్తోంది. కొంత కాలం క్రితం గోపీచంద్ హీరో గా శ్రీ వాసు దసకత్వంలో రామబాణం అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను ఈ బ్యానర్ వారే నిర్మించారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా ద్వారా విశ్వ ప్రసాద్ కు పెద్ద మొత్తం లో నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే.

మూవీ ని కూడా విశ్వ ప్రసాద్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా ద్వారా కూడా ఈయనకు భారీ ఎత్తున నష్టాలు వచ్చినట్లు తెలుస్తుంది. ఇకపోతే హిట్ , ఫ్లాప్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా విశ్వ ప్రసాద్ మాత్రం వరుస పెట్టి సినిమాలను నిర్మిస్తూనే వాలుతున్నాడు. ప్రస్తుతం కూడా ఈయన చాలా సినిమాలను నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: