టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రకాల సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. అందులో కొన్ని ప్రేమకథలు అయితే, కొన్ని యాక్షన్ అలాగే, క్రైమ్, హారర్ సినిమాలు కూడా ఉంటున్నాయి. అయితే... ఇందులో కొన్ని సినిమాలు సక్సెస్ అయితే మరికొన్ని అట్టర్ ఫ్లాఫ్ అవుతున్నాయి. అయితే సినిమా సక్సెస్ అయిన అలాగే ఫ్లాప్ అయినా... దాని ప్రభావం నిర్మాతపై ఖచ్చితంగా ఉంటుంది. అలా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర అధినేత బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా చాలా సినిమాలు తీశారు.

 

అందులో కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని విఫలమయ్యాయి. ముఖ్యంగా బి వి ఎస్ ఎన్ ప్రసాద్  నిర్మాణంలో వచ్చిన ఒంగోలు గిత్త, రంగ రంగ వైభవంగా, గాండీవ ధారి అర్జున , అప్పుడు ఇప్పుడు ఎప్పుడో అనే సినిమాలో వచ్చి బాక్స్ ఆఫీస్ ముందు... డిజాస్టర్ గా మిగిలాయి. హీరో రామ్ చేసిన ఒంగోలు గిత్త... కథ బాగున్నప్పటికీ... మిర్చి యార్డ్ చుట్టూ ... రొటీన్ కథను అన్నారు. అందుకే ఈ సినిమా జనాలకు పెద్దగా ఎక్కలేదు.

 

ఇక మెగా హీరో వైష్ణవ తేజ్... హీరోగా రంగ రంగ వైభవంగా సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా...  రొటీన్ కథ కావడమే కాకుండా... సినిమాలో ఎలివేషన్స్ లేవు. మెగా హీరో లాగా వైష్ణవ్ తేజ్  ను తెర పైన చూపించలేకపోయారు. ముఖ్యంగా ఈ సినిమాలో కేతిక శర్మ, హీరో వైష్ణవి తేజ్ మధ్య రొమాంటిక్ సీన్స్ పెద్దగా పండలేదు. దాంతో సినిమా డిజాస్టర్ గా మిగిలింది.

 

ఇక బి వి ఎస్ ఎన్ ప్రసాద్... నిర్మాణంలోనే మరో మెగా హీరో వరుణ్ తేజ్ గాండీవ దారి అర్జున సినిమా వచ్చింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందో? ఎప్పుడు డిజాస్టర్ అయిందో...? ఇప్పటికీ ఎవరికీ తెలియని పరిస్థితి. ఈ సినిమా కోసం టికెట్ కు డబ్బులు పెట్టి వెళ్లే నాధుడే కరువయ్యాడు. ఇక లేటెస్ట్ గా హీరో నిఖిల్ అప్పుడు ఇప్పుడు సినిమాను.. తీశారు. ఈ సినిమా కూడా ఎవరికి తెలియకుండానే థియేటర్లోకి వచ్చి డిజాస్టర్ ను మూటగట్టుకుంది   ఇలా నాలుగు సినిమాల కారణంగా... నిర్మాత బి వి ఎస్ ఎన్ ప్రసాద్... బాగానే నష్టపోయారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: