టాలీవుడ్ యువ నటుడు అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తండాల్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... చందు మండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు అల్లు అరవింద్ , బన్నీ వాసు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ ని వచ్చే నెల విడుదల చేయనున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను , పాటలను మేకర్స్ విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ ను రేపు అనగా జనవరి 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరి ఈ మూవీ ట్రైలర్ ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ మూవీ ట్రైలర్ బాగున్నట్లయితే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగే అవకాశం చాలా వరకు ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాకు నాన్ ధియేటర్ రైట్స్ ద్వారానే 50 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ కి పెద్ద మొత్తంలోనే నా థియేటర్ రైట్స్ ద్వారా డబ్బులు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ సినిమా కనుక విడుదల అయిన తర్వాత మంచి టాక్ ను తెచ్చుకుంటే భారీ కలక్షన్ లను వసూలు చేసే అవకాశం చాలా వరకు ఉంది. అలా జరిగినట్లయితే ఈ మూవీ ద్వారా నిర్మాతలకు పెద్ద మొత్తంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా విడుదల తర్వాత ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా ఇప్పటికే నాన్ ధియేటర్ బిజినెస్ ద్వారా నిర్మాతలకు పెద్ద మొత్తంలో డబ్బులు రావడంతో వారు సేఫ్ జోన్ లోనే ఉన్నారు అనే అభిప్రాయాలను కూడా కొంత మంది జనాలు వ్యక్తపరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nc