తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో విజయ్ దేవరకొండ ఒకరు . ఇకపోతే విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు . ఈ మూవీ ని సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఇకపోతే విజయ్ దేవరకొండ చాలా కాలం క్రితమే రాహుల్ సంకుర్తియన్ దర్శకత్వంలో మూవీ చేయడానికి కమిట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ కి సంబంధించిన ఒక అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ హీరో గా రూపొందుతున్న ఈ మూవీ కి రాహుల్ సంకుర్తియన్ దర్శకత్వం వహించనుండగా ... ఆర్నాల్డ్ విస్లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అజయ్ అతుల్మూవీ కి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేయబోతున్నాడు. ఇరిక్ గౌతియర్ ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా పనిచేయనుండగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఇక ఈ మూవీ పిరియాడిక్ డ్రామా జోనర్ లో రూపొందబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే గతంలో విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకుర్తియన్ దర్శకత్వంలో టాక్సీవాలా అనే మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన టాక్సీవాలా మూవీ మంచి విజయం సాధించడంతో వీరి కాంబోలో తెరకెక్కబోయే తదుపరి మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కి ఇప్పటివరకు టైటిల్ ఫిక్స్ చేయకపోవడంతో VD 14 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ ని కొంత కాలం క్రితం మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd