ఏంటి ఆ హీరోయిన్ నిజంగానే 2 వేల కోట్ల డ్రగ్స్ రాకెట్ లో ఇరుక్కుందా.. దాని నుండి బయటపడడం కోసమే సన్యాసం అని డ్రామాలు ఆడుతుందా.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే రీసెంట్ గా సన్యాసం తీసుకొని ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన మమతా కులకర్ణి.. ఒకప్పుడు బాలీవుడ్ టాలీవుడ్ ని ఒక ఊపు ఊపిన మమతా కులకర్ణి తాజాగా మహాకుంభ మేళలో సన్యాసం తీసుకోవడం సంచలనంగా మారింది. అయితే మమతా కులకర్ణి సన్యాసం తీసుకోవడానికి చాలామంది హిందువులు వ్యతిరేకిస్తున్నారు.. ఆమె సన్యాసం తీసుకోవడం ఒక డ్రామా అని డ్రగ్స్ కేసు నుండి బయటపడడం కోసమే సన్యాసం అని నాటకాలు ఆడుతుందని, ఆమె సన్యాసం తీసుకోవడం వెనుక మాస్టర్ ప్లానే ఉంది అని కొంతమంది హిందువులతో పాటు సోషల్ మీడియా జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు.

 2000 కోట్ల విలువైన డ్రగ్స్ రాకెట్ లో మమతా కులకర్ణి ప్రధాన పాత్ర వహించిందని, అందుకే ఈ కేసు నుండి బయటపడడం కోసమే సన్యాసం తీసుకున్నాను అంటూ డ్రామాలు చేస్తుంది అంటూ ఆరోపిస్తున్నారు.అంతేకాదు తాను ఇప్పటివరకు చేసిన పాపాలన్నీ సన్యాసం తీసుకోవడంతో పోయినట్లుగా ఆమె ఫోటోలకు ఫోజులు కొడుతుంది.. ఏదో పెద్ద డ్రామా ఆడే ఈ సన్యాసం తీసుకుంది. సన్యాసం తీసుకోవడానికి అస్సలు వీల్లేదు అంటూ మాట్లాడుతున్నారు. అయితే గతంలో 2000 కోట్ల డ్రగ్స్ రాకెట్ లో ఇరుక్కున్న మమతా కులకర్ణి దాదాపు రెండు దశాబ్దాలు ఏకంగా భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మహా కుంభమేళా సమయంలో వచ్చిన మమతా కులకర్ణిని సినిమాలోకి రీ ఎంట్రీ ఇస్తుందని అందరు అనుకున్నారు.

కానీ సడన్గా నేను మహా మండేలేశ్వరీ సన్యాసం తీసుకుంటున్నాను అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే కిన్నెర అఖరా కు మహా మండలేశ్వరీగా సన్యాసం తీసుకున్న మమతా కులకర్ణిని ట్రాన్స్ జెండర్ జగద్గురు మహామండలేశ్వర్ హిమాంగి సఖి ఫైర్ అయ్యారు. డ్రగ్స్ కేసులో ఇరుక్కుని జైలు జీవితం కూడా గడపాల్సిన మమతా కులకర్ణి సన్యాసిగా ఎలా స్వీకరిస్తారు. అర్హత లేని వారిని ఇలా అందలం ఎక్కించడం సరైన పద్ధతి కాదు.సనాతన ధర్మం పాటించాలని వారిని ఇలా మహామండలేశ్వరీ గా ఎలా ప్రకటిస్తారు అంటూ తప్పు పట్టారు. అంతే కాదు దీనిపై పూర్తి విచారణ జరపాలని కూడా చెప్పడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మమతా కులకర్ణి సన్యాసం తీసుకోవడంపై వ్యతిరేకత ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: