సంక్రాంతికి విడుదలఅయిన ఈ నిమా ఊహించని ఘనవిజయం సాధించడంతో షాక్ లో ఉన్న ఇండస్ట్రీ వర్గాలు ఈ సినిమాకు ఇలాంటి సూపర్ టాక్ ఎలా వచ్చింది అన్న కోణంలో చర్చలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ సినిమాకు సంబంధించిన కథ చర్చలు జరుగుతున్నప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు అనీల్ రావిపూడికి ఒక సలహా ఇచ్చాడట. ‘జైలర్’ విడుదలై ఘన విజయం సాధించిన తరువాత అనీల్ రావిపూడి సమావేశం జరిగిందట.
‘జైలర్’ మూవీ తరహాలో క్రైమ్ టచ్ ఇస్తూ ఒక కామెడీ స్టోరీ అనీల్ రావిపూడి రాస్తే బాగుంటుంది అన్న ఆలోచన మహేష్ అనీల్ రావిపూడికి షేర్ చేసాడట. దీనితో అనీల్ రావిపూడి ఆలోచన చేసి ఒక కిడ్నాప్ డ్రామాకు ఒక హీరో, ఇద్దరు హీరోయిన్స్ ఫార్ములాను రాసుకుని కథ తయారు చేసుకుని ఆకథను వెంకటేష్ కు చెప్పడం ఆపై ఈ సినిమా నిర్మాణం పూర్తి చేసుకుని విడుదల అవ్వడం ఇలా అన్ని విషయాలు అన్నీ చకచకా జరిగిపోయాయట.
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీని ప్రమోట్ చేస్తూ అనీల్ రావిపూడి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను షేర్ చేశాడు. ప్రస్తుతం మహేష్ రాజమౌళితో నటిస్తున్న మూవీ పనులల్లో బిజీగా ఉన్నప్పటికీ ఈమధ్య జరిగిన ‘సంక్రాంతికి వస్తున్నాం మూవీ యూనిట్ హోస్ట్ చేసిన డిన్నర్ కు రావడం మహేష్ కు అనీల్ రావిపూడి వెంకటేష్ లతో ఉన్న సాన్నిహిత్యాన్ని సూచిస్తోంది. ఈవారం సరైన సినిమాలు లేకపోవడంతో ఈమూవీ కలక్షన్స్ హవా కొనసాగుతుంది..