టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. ఈయన పటాస్ అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టి ఆ తర్వాత ఏడు సినిమాలకు దర్శకత్వం వహించి ఏడింటితో కూడా అద్భుతమైన విజయాలు అందుకొని ఇప్పటి వరకు అపజయం లేని దర్శకుడిగా తెలుగు సినిమా పరిశ్రమలో కొనసాగిస్తున్నాడు.

ఇకపోతే ఈయన తన కెరీర్ లో ఎక్కువ శాతం మీడియం రేంజ్ హీరోలతో , సీనియర్ స్టార్ హీరోలతో సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. కానీ యంగ్ స్టార్ హీరోలతో సినిమాలను తెరకెక్కించలేదు. ఇకపోతే ఒకానొక సందర్భంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సినిమాను రూపొందించే అవకాశం వచ్చిన కూడా ఆయన తొందర పాటు వల్లే ఆ సినిమాను మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన పటాస్ సినిమా పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో అనిల్ రావిపూడి కి దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అని అనిల్ అనుకున్నాడట.

అందులో భాగంగా అనిల్ , తారక్ ను కలిసి ఒక కథను కూడా వివరించాడట. కథ మొత్తం విన్న తారక్ స్టోరీ బాగానే ఉంది. కానీ కొంత కాలం వెయిట్ చెయ్యి చేద్దాం అని అన్నాడట. కానీ అనిల్ మాత్రం వెయిట్ చేయకుండా వేరే సినిమాలకి కమిట్ అయ్యాడట. దానితో ఆ తర్వాత తారక్ బిజీ కావడం వల్ల అనిల్ రావిపూడి కి తారక్ తో సినిమా చేసే అవకాశం రాలేదట. ఇలా తాను తొందర పడడం వల్లే ఎన్టీఆర్ లాంటి యంగ్ స్టార్ హీరోతో సినిమా అనిల్ రావిపూడి మిస్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: