తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని సంవత్సరాల క్రితం అనేక మంది కథ రచయితలు ఉండేవారు. దానితో దర్శకులు ఎక్కువ శాతం స్క్రీన్ ప్లే పై ఫోకస్ పెట్టేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చాలా వరకు మారాయి. ఎవరైనా కథ రచయితగా పని చేసి మంచి సక్సెస్ అయ్యారు అంటే చారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకే వారు తమ సొంత కథతో వారే సినిమాలకు దర్శకత్వం వహిస్తూ వస్తున్నారు. దానితో ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కథ రచయితల కరువు ఏర్పడింది. దానితో ఎవరైనా కొంత సక్సెస్ సాధించిన కథ రచయితలు ఉన్నారు అంటే వారికి అద్భుతమైన స్థాయిలో డిమాండ్ ఉంది.

ఇకపోతే ఈ మధ్య కాలంలో కథ రచయితగా అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయిన వారిలో ప్రసన్న కుమార్ బెజవాడ ఒకరు. ప్రసన్న కుమార్ ఎక్కువ శాతం తన కెరియర్లో త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన సినిమాలకు కథ రచయితగా పని చేశాడు. వీరి కాంబోలో రూపొందిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఆఖరుగా వీరి కాంబోలో ధమాకా అనే మూవీ వచ్చింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో మజాకా అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటించాడు.

ఈ సినిమాకు కూడా ప్రసన్న కుమార్ కథను అందించాడు. ఇకపోతే ఈ సినిమా కోసం ప్రసన్న కుమార్ ఏకంగా 2.5 కోట్ల పారితోషకాన్ని పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈయన అదిరిపోయే రేంజ్ పారితోషకాన్ని ఈ సినిమా కోసం అందుకున్నట్లు వార్తలు వస్తాయి. ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లయితే ప్రసన్న కుమార్ పారితోషకం మరింత పెరిగే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: