తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ కొంత కాలం క్రితం హెచ్ వినోద్ దర్శకత్వంలో తలపతి 69 అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ ని స్టార్ట్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా కనిపించనుండగా ... ప్రేమలు బ్యూటీ మమిత బైజు ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది.

ఇక ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఈ మూవీ బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ అని ఓ వార్త బలంగా వైరల్ అయింది. ఇక విజయ్ హీరోగా పూజ హెగ్డే , మమిత బైజు ఈ మూవీలో నటిస్తూ ఉండడం , భగవంత్ కేసరి సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా. .. శ్రీ లీల ఓ కీలకమైన పాత్రలో కనిపించడంతో ఈ సినిమా ఖచ్చితంగా భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ అని చాలా మంది అభిప్రాయ పడ్డారు. ఇకపోతే నిన్న అనగా ఆగస్టు 15 వ తేదీన తలపతి 69 మూవీ బృందం ఈ మూవీ కి సంబంధించిన టైటిల్ ను అనౌన్స్ చేస్తూ పోస్టర్లను కూడా విడుదల చేశారు. ఇక ఈ మూవీ బృందం ఈ సినిమాకు జన నాయగన్ అనే టైటిల్ ను ఖరారు చేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇక ఈ మూవీ బృందం విడుదల చేసిన పోస్టర్ల ప్రకారం ఈ సినిమా భగవంత్ కేసరి సినిమాకు రీమిక్ లా అనిపించడం లేదు అనే అభిప్రాయాలను చాలా మంది వినిపిస్తున్నారు.

మరి దానితో చాలా మంది ఈ సినిమా ఒక వేల భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ అయినా అందులోని కేవలం చిన్న కథ పాయింట్లు తీసుకొని మిగతాదంతా కూడా తమిళ్ నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసి ఉండే అవకాశం కూడా ఉంది అనే వాదనను కూడా కొంత మంది వినిపిస్తున్నారు. మరి ఈ సినిమా భగవంత్ కేసరి మూవీ కి రీమిక్ అవునా ... కాదా అనేది తెలియాలి అంటే ఈ మూవీ విడుదల తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: