గేమ్ ఛేంజర్ సినిమాను చరణ్ శంకర్ కాంబినేషన్ ను నమ్ముకుని దిల్ రాజు నిర్మించగా ఈ సినిమా ఫలితం మాత్రం ఆశాజనకంగా లేకపోవడం గమనార్హం. ఈ సినిమా ఫుల్ రన్ లో కేవలం 103 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. డాకు మహారాజ్ రెండో వారం కూడా పరవాలేదనే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటూ ఉండగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ మాత్రం కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు 260 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు 130 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. దిల్ రాజుకు భారీ నష్టాలను మిగిల్చిన మరో రెండు సినిమాలు ఏవనే ప్రశ్నకు శ్రీనివాస కళ్యాణం, రామయ్యా వస్తావయ్యా సినిమాల పేర్లు సమాధానంగా వినిపిస్తాయి. ఈ మూడు సినిమాలు హిట్టై ఉంటే దిల్ రాజు సక్సెస్ రేంజ్ మరింత పెరిగేదని కచ్చితంగా చెప్పవచ్చు.
దిల్ రాజు సినిమా రంగంపై అభిరుచితో ఇండస్ట్రీపై దృష్టి పెట్టి ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. ఎన్నో సినిమాల సక్సెస్ లో దిల్ రాజు కీలక పాత్ర పోషించారని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. దిల్ రాజుకు భవిష్యత్తు సినిమాలు సైతం భారీ విజయాలను అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. దిల్ రాజు భవిష్యత్తు ప్రాజెక్ట్స్ విషయంలో ఒకింత ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దిల్ రాజును అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.