తెలుగు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరుపొందిన వారిలో రాజమౌళి ముందు వారసలో ఉంటారు. రాజమౌళి నుంచి సినిమా రావడానికి కాస్త ఆలస్యమైనప్పటికీ.. సక్సెస్ అందుకోవడం జరుగుతుంది. ముద్దుగా అందరూ ఈయనని జక్కన్న అని పిలుస్తూ ఉంటారు. ప్రపంచ దేశాలను సైతం తెలుగు ఇండస్ట్రీ వైపుగా చూసేలా చేసిన రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని రోజు రోజుకి పెంచేస్తూ ఉన్నారు. చిన్న హీరోలను కూడా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ చేసిన డైరెక్టర్గా పేరు సంపాదించారు. కానీ ఆయనతో చేసిన సినిమా తర్వాత హీరోల సినిమాలు ఫ్లాపులుగా నిలుస్తున్నాయనే సెంటిమెంట్ మాత్రం అలాగే మిగిలిపోయింది.


జూనియర్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ తీసిన రాజమౌళిసినిమా మంచి విజయాన్ని ఇచ్చిన ఆ తర్వాత సుబ్బు సినిమాతో ఫ్లాప్ మిగిల్చుకున్నారు..

యంగ్ హీరో నితిన్ కూడా సై సినిమాతో హిట్ ఇవ్వగా ఆ తర్వాత అల్లరి బుల్లోడు సినిమాతో ఫ్లాప్ ని మూట కట్టుకున్నారు.

రవితేజ తో విక్రమార్కుడు సినిమా తీసి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న రవితేజ ఆ తర్వాత ఖతర్నాక్ సినిమాతో ఫ్లాప్ ని మూటగట్టుకున్నారు.


ఈగ సినిమాతో నాని మంచి విజయాన్ని అందుకోగా ఆ తర్వాత ఎటో వెళ్లిపోయింది మనసుతో ఫ్లాప్ గా నిలిచింది.


ప్రభాస్ నటించిన బాహుబలి 1,2 చిత్రాలు హిట్టుగా నిలువగా సాహో ఫ్లాప్ గా నిలిచింది.


RRR సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ ఆచార్య సినిమాతో డిజాస్టర్ గా మిగిలారు..


చత్రపతి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ప్రభాస్ ఆ తర్వాత పౌర్ణమి సినిమాతో ప్లాప్ మూట కట్టుకున్నారు.


మగధీర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రాంచరణ్ ఆ తర్వాత ఆరంజ్ తో  ఫ్లాప్ ని అందుకున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు తో సినిమా చేస్తున్నారు రాజమౌళి.

మరింత సమాచారం తెలుసుకోండి: