పవన్ కళ్యాణ్ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి . ప్రతి ఒక్కరికి తెలిసిన పేరే.  ఒకప్పుడు సినీ స్టార్ గా ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలను పూర్తిగా సక్రమంగా నిర్వహిస్తున్న రియల్ హీరో అని చెప్పాలి . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎంత నిజాయితీగా సినిమాల పట్ల డెడికేషన్ గా వర్క్ చేశారో ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం గా కూడా అంతే డెడికేషన్ తో వర్క్ చేస్తున్నాడు అంటున్నారు జనాలు . అంతేకాదు దానికి తగ్గ ఫలితం కూడా చూపిస్తున్నారు . ఎక్కడ అవినీతి అనేది లేకుండా తనదైన స్టైల్ లో తన పవర్ ని కాపాడుకుంటూ ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ పవర్ కట్ చేస్తాం అన్న రేంజ్ లో దూసుకుపోతున్నారు .


కాగా పవన్ కళ్యాణ్ లో మొదటి నుంచి ఒక గుణం మనం బాగా గమనించొచ్చు . అది సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అధికారం లో తప్పు ఎవ్వరు చేసిన సరే తన సొంత ఇంటి మనుషులు చేసిన సరే అది తప్పు అంటూ ఓపెన్గానే చెప్పేస్తాడు.  ఆ విషయం అందరికీ తెలుసు.  అంతే కాదు ఎక్కడైనా తప్పు జరిగితే ఆ విషయాన్ని నిర్మొహమాటంగా బయటపెట్టేస్తాడు. కానీ మన ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో చాలామంది అలా బయటకు చెప్పరు. అమ్మో తప్పు చేసిన వ్యక్తి పేరు బయటపడితే ఎక్కడ తమ పేరుపై నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతుంది అన్న భయం కారణంగా చాలామంది ఆ తప్పులు కప్పి పెట్టేస్తూ ఉంటారు .



అయితే పవన్ కళ్యాణ్ తర్వాత అలా ఉన్నది ఉన్నట్లు నిజాయితీగా మాట్లాడే తెలుగు హీరో మాత్రం నాచురల్ స్టార్ నానినే అంటున్నారు జనాలు . ఎక్కడైనా అన్యాయం జరిగితే మొదటిగా సోషల్ మీడియా వేదికగా రెస్పాండ్ అయ్యేది నానినే. అల్లు అర్జున్ అరెస్టు విషయంలో ముందుగా రెస్పాండ్ అయింది కూడా నాని . కేవలం అల్లు అర్జున్ విషయమే చాలా విషయాలలో కూడా నాని తన అభిప్రాయాన్ని ఓపన్ గా చెప్పుకొచ్చారు . ఇది చేయడం తప్పు అంటూ అధికార పార్టీని కూడా ఆయన వేలెత్తి చూపించిన రోజులు కూడా ఉన్నాయి . దీంతో పవన్ కళ్యాణ్ తర్వాత అలాంటి దమ్మున్న రియల్ హీరో నానినే అంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: