టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రెస్టీజియస్ బ్యానర్లలో మైత్రీ బ్యానర్ ఒకటనే సంగతి తెలిసిందే. మైత్రీ బ్యానర్ లో తెరకెక్కిన పుష్ప1, పుష్ప2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టించాయో చెప్పాల్సిన అవసరం లేదు. మైత్రీ నిర్మాతలకు తీరని నష్టాలను మిగిల్చిన సినిమాలకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
 
అయితే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చిన సినిమాలలో అమిగోస్ ఒకటి. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన అమిగోస్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. రవితేజ శ్రీనువైట్ల కాంబోలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన అమర్ అక్బర్ ఆంటోని సినిమా కూడా నిర్మాతలను నిండా ముంచేసింది.
 
నాగచైతన్యతో మైత్రీ నిర్మాతలు నిర్మించిన సవ్యసాచి, విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమాలు నిర్మాతలకు భారీ నష్టాలు మిగిల్చాయి. మైత్రీ నిర్మాతలు రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ను నిర్మిస్తుండగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తాయో చూడాల్సి ఉంది. మైత్రీ నిర్మాతలకు 2025 సంవత్సరం ఏ రేంజ్ లో కలిసొస్తుందో చూడాలి.
 
మైత్రీ నిర్మాతలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లను నిర్మిస్తూ ఇతర భాషల్లో సత్తా చాటుతున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం మైత్రీ నిర్మాతలు పలు క్రేజీ ప్రాజెక్ట్ లను నిర్మిస్తుండటం గమనార్హం. మైత్రీ నిర్మాతల రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. పుష్ప3 సినిమాను వీలైనంత వేగంగా సెట్స్ పైకి తీసుకెళ్తే బాగుంటుందని చెప్పవచ్చు. మైత్రీ నిర్మాతలు అద్భుతమైన సినిమాలను నిర్మిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. మైత్రీ నిర్మాతలకు ఇతర భాషల్లో సైతం భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మైత్రీ నిర్మాణ సంస్థపై తాజాగా ఐటీ రైడ్స్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఐటీ రైడ్స్ తర్వాత మైత్రీ నిర్మాతలు మాత్రం రైడ్స్ గురించి ఎలాంటి కామెంట్లు చేయలేదు.







మరింత సమాచారం తెలుసుకోండి: