మళ్లీ అల్లు అర్జున్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం ప్రారంభించాయి . గతంలో పుష్ప2 సినిమా రిలీజ్ కి ముందు ఉన్న క్రేజ్ మళ్లీ తన పేరుపై దక్కించుకునేలా చేసుకుంటున్నాడు అల్లు అర్జున్ . కాగా పుష్ప1 సినిమా రిలీజ్ టైం లో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన కారణంగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి ఒక నైట్ జైల్లో ఉంచిన విషయం అందరికీ తెలిసిందే . ఇది ఆయన లైఫ్ లో మర్చిపోలేనిది ఎప్పటికీ ఈ బాధ ఎవరు చెరపలేనిది .


అది అందరికీ తెలుసు . కాగ దీనికి సంబంధించిన రకరకాల ట్రోలింగ్ కూడా ఫేస్ చేశాడు అల్లు అర్జున్ . అయితే ఇప్పుడు అల్లు అర్జున్ మళ్ళీ సినిమాలపై కాన్సన్ట్రేషన్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.  అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు క్సాంబోలో తెరకెక్కే సినిమాకి సంబంధించి  ఆల్రెడీ కొన్ని కొన్ని సీన్స్ షూట్ చేసినట్లు వార్తలు వినిపించాయి . కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉందట మూవీ టీం.  అంతేకాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా లేటెస్ట్ హిట్ హీరోయిన్ మీనాక్షి చౌదరిని చూస్ చేసుకున్నారట మాటల మాంత్రికుడు .



ఆల్రెడీ "గుంటూరు కారం" సినిమాలో మీనాక్షి చౌదరిని బాగా చూయించాడు అన్న కామెంట్స్ దక్కించుకున్నాడు . కాగా ఆ తర్వాత మీనాక్షి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ వచ్చింది. రీసెంట్గా "సంక్రాంతికి వస్తున్నాం " సినిమాతో బిగ్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది . అయితే ఇప్పుడు త్రివిక్రమ్ కన్ను మీనాక్షి చౌదరి పై పడిందట. బన్నీతో రొమాన్స్ చేయించడానికి సిద్ధంగా ఉన్నాడట.  చాలామంది రష్మిక ను బీట్ చేసే అంత కెపాసిటీ ఉంది మీనాక్షికి అంటూ మాట్లాడుకుంటున్నారు.  అల్లు అర్జున్ సినిమా ఛాన్స్ ఇస్తే మాత్రం నో డౌట్ ఇండస్ట్రీలో నెక్స్ట్ నేషనల్ క్రష్ మీనాక్షి అని చెప్పేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: