అంతేకాదు ఈమె సినీ ఇండస్ట్రీలో కూడా ఒక లైలా కోసం, లెజెండ్ లాంటి కొన్ని సినిమాలలో కూడా పలు పాత్రలలో కనిపించింది. ఇక అంజలి పవన్ ఒక బుల్లితెర నటి మాత్రమే కాదు.. ఈమె చాలా షోలకు కూడా హోస్ట్ గా వ్యవహరించింది. ఈమె పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్ లోనే. ఈమె 2015 జనవరి 26 వ తేదీన బుల్లితెర నటుడు సంతోష్ పవన్ ని వివాహం చేసుకుంది. 2020 లో వీరిద్దరికీ ఒక ఆడపిల్ల కూడా పుట్టింది. ఇప్పుడు ఆ పాప కి చందమామ అని పేరు పెట్టి.. ఆ పాప ని కూడా ఫేమస్ చేశారు.
పెళ్లి తర్వాత అంజలి తన భర్త పవన్ తో కలిసి నీతోనే డాన్స్ అనే అటువంటి రియాలిటీ షోలలో కూడా పాల్గొన్నారు. ఇక పెళ్లి అయ్యే పదేళ్లు అయినప్పయికి అంజలి తన భర్తతో కలిసి దిగిన ఫోటోస్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఇప్పుడు అవి తెగ వైరల్ అవుతున్నాయి. అంజలి పవన్ అభిమానులు మీరిద్దరు ఎప్పుడు ఇలాగే ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.