ఏంటి ఒక్క సినిమాకి 226 కోట్లా.. వింటుంటేనే షాకింగ్ గా అనిపిస్తుంది అని అనుకుంటారు ఈ అంకెలు విన్న చాలా మంది నెటిజన్ లు..మరి ఇంతకీ 226 కోట్లు ఒక్క సినిమాకి తీసుకోబోతున్న ఆ హీరో ఎవరు అనేది చూస్తే తమిళ నటుడు అజిత్.. కోలీవుడ్ హీరో అజిత్ గురించి తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన తాజాగా నటించిన విడాముయర్చి సినిమాకి దాదాపు 150 కోట్లు తీసుకున్నారట. అలాగే గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీకి 163 కోట్లు తీసుకున్నారట. ఇక త్వరలోనే అజిత్ రెడ్ జాయింట్ మూవీస్ బ్యానర్ వాళ్ళు అజిత్ ని హీరోగా పెట్టి ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. అయితే ఈ సినిమాలో హీరోగా చేయడానికి అజిత్ 226 కోట్ల భారీ పారితోషికాన్ని  డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.

అయితే రెమ్యూనరేషన్ ఎంతైనా పర్వాలేదు కానీ ఈ సినిమాలో కచ్చితంగా అజిత్ నటించాల్సిందే అని రెడ్ జాయింట్ మూవీస్ వాళ్ళు కూడా అంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నట్టు తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రికార్డ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా అజిత్ ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించారు.ప్రస్తుతం తమిళ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఒక్క సినిమాకి 226 కోట్ల అంటూ చాలామంది జనాలు నోరెళ్లబెడుతున్నారు. ఇక అజిత్ రీసెంట్ గానే తన నటనతో పద్మభూషణ్ అవార్డును అందుకున్న సంగతి మనకు తెలిసిందే.

అలాగే అజిత్ కి ఈ మధ్యన అన్ని మంచి శకునాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే దుబాయిలో జరిగిన కార్ రేసింగ్ పోటీలో మూడో ప్లేస్ లో నిలిచి ఇండియాకే గర్వకారణంగా మారారు.అలాగే పద్మభూషణ్ అందుకొని తమిళ ఇండస్ట్రీకి గర్వకారణంగా పేరు తెచ్చుకున్నారు. ఏది ఏమైనప్పటికి అజిత్ 226 కోట్ల భారీ రెమ్యూనరేషన్ అంటే సంచలమే అని చెప్పవచ్చు. మరి చూడాలి 226 కోట్ల రెమ్యూనరేషన్ ని అజిత్ డిమాండ్ చేశారు అంటూ వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉందో ఈ విషయంపై రెడ్ జాయింట్ మూవీస్ వాళ్ళు క్లారిటీ ఇస్తారా అనేది

మరింత సమాచారం తెలుసుకోండి: