సినిమా ఇండస్ట్రీ లో ఓ సినిమా విడుదల అయ్యి ఆ సినిమాలో కథ , కంటెంట్ సరిగ్గా లేకుండా ఉండి అలాంటి మూవీ లు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా పడినట్లయితే ఆ సినిమాలో హీరోగా నటించిన నటుడు అయిన ఆ మూవీ కి దర్శకత్వం వహించిన దర్శకుడైన ఆ మూవీ ని నిర్మించిన నిర్మాత అయిన పెద్దగా ఫీల్ అయ్యే అవకాశాలు ఉండవు. కానీ సినిమాలో కథ , కంటెంట్ అన్ని బలంగా ఉండి కూడా సినిమాలు ప్రేక్షకులు ఆదరించకపోతే ఎందుకు ఇలా అయ్యింది అని ఆ సినిమా హీరో , దర్శకుడు , నిర్మాత ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు.

ఇకపోతే ఇలాంటి సందర్భాలు ఎక్కువ శాతం మహేష్ బాబు సినిమాలకే ఎదురైనట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... మహేష్ ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే మహేష్ కొంత కాలం క్రితం ఖలేజా అనే సినిమాలో హీరో గా నటించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే మహేష్ కొంత కాలం క్రితం సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 1 నేనొక్కడినే అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కూడా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇలా థియేటర్లలో విడుదల అయిన తర్వాత ప్రేక్షకులను నిరుత్సాహ పరిచిన ఈ రెండు సినిమాలు ఆ తర్వాత బుల్లి తెరపై మాత్రం ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకున్నాయి. ఈ రెండు సినిమాలు అద్భుతం అని , ఇందులో కథ సూపర్ గా ఉంటుంది అని ఈ రెండు మోగులపై అనేకమంది ప్రశంసలను కూడా కురిపించారు. కానీ విడుదల సమయంలో మాత్రం ఈ మూవీ కి నెగటివ్ టాక్ రావడంతో ఈ మూవీ లు బాక్సా ఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: