వైజయంతి మూవీస్ బ్యానర్.. ఒకప్పుడు ఈ బ్యానర్ లో వరుస సినిమాలు వచ్చేవి. ఈ బ్యానర్ ద్వారా ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలో స్టార్లుగా నిలిచారు. అలా సీనియర్ ఎన్టీఆర్ మొదలు ఇప్పటి ప్రభాస్ వరకు ఎంతో మంది ఈ బ్యానర్ సినిమాల్లో నటించిన వారు ఉన్నారు. అయితే అలాంటి బ్యానర్ ని స్థాపించిన నిర్మాత అశ్వినీ దత్ అంటే ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని పేరు. అశ్వినీ దత్ పక్కకు జరిగాక ఈయన ప్లేసులో ఈ బ్యానర్ పై ఆయన కూతుర్లు ఇద్దరు నిర్మణ రంగంలోకి వచ్చి స్థిరపడ్డారు. ఇక గత ఏడాది ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమాతో వైజయంతి మూవీస్ బ్యానర్ మళ్లీ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. అయితే అలాంటి అశ్వినీ దత్ ఇండస్ట్రీలో పడి లేచిన కెరటంలా ఎన్నో ఫ్లాప్ లు హిట్ల మధ్య ఆయన తన ప్రస్తానాన్ని కొనసాగించారు.

ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా ఫ్లాఫ్ అవ్వడంతో ఆయన ఇండస్ట్రీని వదిలి వెళ్లాలనుకున్నారట. మరి ఇంతకీ అశ్వినీ దత్ ని నిండా ముంచేసిన సినిమాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అశ్వినీ దత్ నిర్మతగా చేసిన ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయి.కొన్ని సినిమాలు ప్లాఫ్ అయ్యాయి.కానీ ఇందులో ఘోరంగా ప్లాప్ అయినవి మాత్రం శక్తి,సైనికుడు, సుభాష్ చంద్రబోస్.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన శక్తి,వెంకటేష్ నటించిన సుభాష్ చంద్రబోస్, మహేష్ బాబు నటించిన సైనికుడు ఈ సినిమాలన్నీ కూడా భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీగా డిజాస్టర్ అయ్యాయి. ముఖ్యంగా శక్తి సినిమా మాత్రం అశ్వినీ దత్ ని కోలుకోలేని దెబ్బ కొట్టింది.

ఈ ఫ్లాప్ గురించి ఓ ఇంటర్వ్యూలో అశ్వినీ దత్ మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన శక్తి సినిమా నన్ను తీవ్రంగా నష్టాల పాలు చేసింది. ఈ సినిమా వల్ల నేను 32 కోట్లు నష్టపోయాను. ఇక ఈ ప్లాఫ్ కారణంగా నేను ఐదారు సంవత్సరాలు ఇండస్ట్రీకే దూరంగా ఉన్నాను.అంతేకాదు ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఆ సమయంలోనే మళ్ళీ గట్టిగా నిలబడి ఇండస్ట్రీలోకి కమ్ బ్యాక్ అయ్యాను అంటూ అశ్వినీ దత్ చెప్పుకొచ్చారు. ఇవే కాకుండా సైనికుడు, సుభాష్ చంద్రబోస్ సినిమాలు కూడా అశ్వినీ దత్ ని తీవ్రంగా నష్టాలు పాలు చేశాయి. అలా ఈ మూడు సినిమాల కారణంగా అశ్వినీ దత్ కి తీవ్రంగా నష్టాలు వచ్చాయి.కానీ ఆ తర్వాత చేసిన సినిమాల్లో లాభాలు రావడంతో మళ్లీ నిర్మాత ఇండస్ట్రీలో పుంజుకున్నాడు

మరింత సమాచారం తెలుసుకోండి: