చూడడానికి ఎంతో అమాయకుడిలా కనిపించే మహేష్ బాబు నిజంగానే షూటింగ్ సెట్ లో హీరోయిన్లను వేధిస్తారా..ఇంతకీ ఆ నటి చెప్పిన మాటల్లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. మహేష్ బాబు మొదటి హిట్ కొట్టిన మురారి సినిమా చాలా మందే చూసుంటారు. కృష్ణ వంశీ డైరెక్షన్లో వచ్చిన మురారి సినిమా ఇప్పటికి కూడా టెలివిజన్లో వస్తే చాలామంది ఇష్టంగా చూస్తారు. అయితే అలాంటి మురారి సినిమాలో బాలీవుడ్ నటి సోనాలి బింద్రే మహేష్ బాబు సరసన నటించిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో సోనాలి బింద్రేని మహేష్ బాబు శాడిజంతో ఆటపట్టించి మరీ ఏడిపించారట.అయితే ఈ విషయాన్ని స్వయంగా సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన సుధా చెప్పింది. పిన్ని,అత్త,అమ్మ వంటి పాత్రలు పోషించే సుధ మురారి సినిమాలో కూడా నటించారు.

ఇక ఈమె మన్మధుడు మూవీలో నాగార్జున పిన్ని పాత్రలో చేసింది అంటే అందరికీ ఇట్టే గుర్తుకొస్తుంది. అలాగే నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఆర్తి అగర్వాల్ తల్లి పాత్రలో నటించింది. అయితే అలాంటి సుధా ఓ ఇంటర్వ్యూలో మురారి సినిమా విశేషాలు పంచుకుంటూ ఈ సినిమా షూటింగ్ సమయంలో మహేష్ బాబు సోనాలి బింద్రే ని ఏడిపించారట. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు సోనాలి బింద్రేను ఏడిపించే సన్నివేశాలు కొన్ని ఉంటాయి.కానీ డైరెక్టర్ చెప్పిన దానికంటే ఎక్కువ చేసి మహేష్ బాబు నిజంగానే సోనాలి బింద్రేను ఏడిపించారట. ఇక అప్పుడప్పుడు మహేష్ బాబు చేసిన పనికి సోనాలి బింద్రే నిజంగానే కన్నీళ్లు పెట్టుకునేదట.

అయితే ఈ విషయాన్ని నటి సుధ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అలాగే షూట్ అయిపోయాక సోనాలి బింద్రే సుధా మహేష్ బాబులు మాట్లాడకునే దగ్గరికి వచ్చి డైరెక్టర్ చెప్పకున్నా కూడా మీరు కావాలనే నన్ను ఏడిపించారు కదా అని కన్నీళ్లు పెట్టుకుంది అంటూ నటి సుధ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది.అయితే మహేష్ బాబు ఇలా సరదాగా మాత్రమే చేశారని, ఉద్దేశపూర్వకంగా ఏమీ సోనాలి బింద్రే ని ఏడిపించలేదని,కేవలం ఫన్ కోసమే అలా షూటింగ్లో చేశారంటూ సుధా చెప్పింది. ఇక తెలుగులోకి మురారి సినిమాతో వచ్చిన సోనాలి బింద్రేకి ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: