దుల్కర్ సల్మాన్ హీరో గా మీనాక్షి చౌదరి హీరోయిన్గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. కొంత కాలం క్రితం విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. అలాగే అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. మరి దానితో ఈ సినిమా టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఎన్ని లాభాలను అందుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి తెలుగు రాష్ట్రాల్లో 38.90 కోట్ల కలెక్షన్లు దక్కగా , కేరళ లో 22.20 కోట్లు , కర్ణాటక లో 7.05 కోట్లు , తమిళనాడు లో 16.54 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియా లో 2.15 కోట్లు , ఓవర్సీస్ లో 27.50 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 55.60 కోట్ల షేర్ ... 114.30 గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 26.90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 28 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇక టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి 27.60 కోట్ల లాభాలు వచ్చాయి. దానితో ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: