మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో చరణ్ రెండు పాత్రలలో నటించాడు. ఒక పాత్రలో తండ్రిగానూ , మరొక పాత్రలో కొడుకుగానూ కనిపించాడు. తండ్రి పాత్రలో నటించిన చరణ్ కి జోడీగా అంజలి నటించగా ... కొడుకు పాత్రలో నటించిన చరణ్ కి జోడీగా కియార అద్వానీ నటించింది. ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో నటించగా ... శ్రీకాంత్ , సునీల్ , బ్రహ్మానందం , నవీన్ చంద్ర , జయరాం ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చరణ్ , బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి టైటిల్ ను మేకర్స్ ఇప్పటి వరకు ఫిక్స్ చేయని నేపథ్యంలో ఆర్ సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ ని రూపొందిస్తూ వస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు.

ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా ఏ ఆర్ రెహమాన్ ఏ సినిమా సంగీత దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకున్నట్లు కొత్త సంగీత దర్శకుడిని ఈ మూవీ బృందం వారు తీసుకోబోతున్నట్లు ఓ వార్త తెగ వైరల్ అయింది. ఇకపోతే ఈ మూవీ నుండి రెహమాన్ తప్పుకున్నాడు అని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదు అని , అవి పూర్తిగా అవాస్తవమైన వార్తలు అని తెలుస్తోంది. ఇలా రెహమాన్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడు అని వచ్చిన వార్తలు అన్ని అవస్తవం అని వార్తలు వస్తూ ఉండడంతో చరణ్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: