టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి గత నాలుగున్నర దశాబ్దాలుగా తిరుగు లేని స్టార్ హీరోగా కొనసాగుతున్నారు .. మెగా ఫ్యామిలీకి చిరంజీవి బలమైన వరుసత్వం అందించారు చిరంజీవి బాటలో ఈరోజు మెగా ఫ్యామిలీ నుంచి 11 మంది కి పైగా హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చి హీరోలుగా కొనసాగుతూ సినిమాలు చేస్తున్నారు .. అలాగే అదే ఫ్యామిలీ నుంచి మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదల కూడా సినిమాలలోకి వచ్చి హీరోయిన్గా కొన్ని సినిమాలు చేశారు . అలాగే బుల్లితెరపై వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నారు ..


ఇదిలా ఉంటే టాలీవుడ్ లో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప‌ పార్ట్ 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ డూపర్ హిట్ కొట్టి దేశవ్యాప్తంగా ఉన్న ఎందరో స్టార్ హీరోలకు సవాల్ విస్తరిస్తున్న పరిస్థితి .. ఇక మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కు మధ్య కాస్త గ్యాప్ ఉందన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే . ఈ ప్రచారం సంగతి అలా ఉంచితే .. అల్లు అర్జున్ , చిరంజీవి కాంబినేషన్లో గతంలో ఒక సినిమా వచ్చింది .. ఆ సినిమా ఏదో కాదు 2001లో చిరంజీవి హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన డాడీ ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా సిమ్రాన్ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆషిమా భల్లా హీరోయిన్లుగా నటించారు ..


మణిశర్మ స్వరాలు అందించారు పై అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు .. కంప్లీట్ ఫ్యామిలీ స్టోరీ తో వచ్చిన డాడీ ఓవర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని య‌వ‌రేజ్‌ సినిమాగా నిలిచింది .. ఈ సినిమా ఆ రోజుల్లోనే దాదాపు 25 కేంద్రాలలో వంద రోజులు ఆడింది .. ఒక డ్యాన్స్ బిట్లో అల్లు అర్జున్ అదిరిపోయే స్టెప్పులు వేసి అప్పట్లో అందరిని ఆకట్టుకున్నాడు .. ఈ స్టెప్పులు చూసినవారు ఎవరో కానీ చాలా అద్భుతమైన స్టెప్పులు వేశాడు అని ప్రశంసలు కురిపించారు .. ఆ తర్వాత రెండున్నర సంవత్సరాలకు అల్లు అర్జున్ ను .. కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు .

మరింత సమాచారం తెలుసుకోండి: