టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో తేజ సజ్జ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో అనేక సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. గత కొంత కాలంగా తేజ సినిమాల్లో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. ఇకపోతే ఆఖరుగా తేజ సజ్జ "హనుమాన్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయినా ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో తేజ కు ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది.

ఇకపోతే ప్రస్తుతం తేజ , కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న మిరాయ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ యొక్క ఆడియో హక్కులను టిప్స్ మ్యూజిక్ కంపెనీ ఏకంగా 2.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే కార్తీక్ ఘట్టమనేని కొంత కాలం క్రితం మాస్ మహారాజా రవితేజ హీరో గా రూపొందిన ఈగల్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కావ్య దాపర్ హీరోయిన్గా నటించగా ... అనుపమ పరమేశ్వరన్ , నవదీప్మూవీ లో కీలక పాత్రలలో నటించారు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరుత్సాహ పరిచింది. మరి ఈగల్ మూవీ తో ప్రేక్షకుల నిరుత్సాహపరిచిన కార్తీక్ ఘట్టమనేని "మిరాయ్" మూవీ తో ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తాడో చూడాలి. హనుమాన్ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత తేజ సజ్జ హీరోగా రూపొందుతున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మిరాయ్ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: