నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ లోనే ఎప్పుడూ లేనంత ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు .. అఖండ సినిమాతో మొదలైన బాలయ్య విజీయాల పరంపర వరుసగా కొనసాగుతూ వస్తోంది .. అఖండ , వీర సింహారెడ్డి , భగవంత కేసరి తాజాగా డాకు మహారాజ్ సినిమాలు ఒకదానిని మించి మరొకటి సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి .. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాకు సిక్వ‌ల్‌గా వస్తున్న అఖండ 2 లో నటిస్తున్నారు ..ఈ సినిమాను ఈ ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురానన్నారు ..


ఇది ఇలా ఉంటే బాలయ్య తన కెరీర్లో ఎంతోమంది హీరోయిన్లతో కలిసి ఎన్నో సినిమాలలో నటించారు .. విజయశాంతి , సిమ్రాన్ , ప్రగ్యా జైస్వాల్ , రాధిక ఆప్టే , సోనాల్ చౌహన్ లాంటి హీరోయిన్లను రిపీట్ చేస్తూ వస్తున్నారు .. బాలయ్య తన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో నటించిన ఎప్పుడూ ఎవరు ఏ హీరోయిన్ కూడా బాలయ్యను ఇబ్బంది పెట్టాలని చూడరు .. బాలయ్య హీరోయిన్లకు అంత గౌరవం వేల్యూ ఇస్తారు .. అయితే వీరభద్ర సినిమాలో నటించిన తాను శ్రీ దత్త ఆస్ట్రేలియాలో షూటింగ్ జరుగుతూ ఉండగా చాలా ఇబ్బందులు పెట్టిందట .. అక్కడ షూటింగ్ జరుగుతూ ఉండగా ఒక రోజు సడన్గా తన తండ్రికి ఆరోగ్యం సరిగాలేదని తాను వెంటనే ఇండియా వెళ్లిపోవాలని షూటింగుకు డూమ్మా కొట్టేసిందట ..


తానుశ్రీ షూటింగ్‌కు రాకపోవడంతో బాలయ్యతో పాటు మిగిలిన నటునటులు అందరూ అక్కడ ఖాళీగా ఉన్నారు .. ఈ టైంలో నిర్మాత అంబికా కృష్ణ తానుశ్రీ దగ్గరికి వెళ్లి నువ్వు షూటింగ్ కు రాకపోతే నాకు చాలా నష్టం వస్తుంది .. బాలయ్య తో పాటు అందరి కాల్షియెట్లు వేస్ట్ అవుతాయి అని బుజ్జగించడం తో చివరకు తానుశ్రీ తిరిగి షూటింగ్ కు వచ్చిందట .. ఈ విషయాన్ని నిర్మాత అంబికా కృష్ణ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు . ఇక‌ ఆమె తీరుతో బాలకృష్ణతో పాటు ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడినట్టు గుర్తు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: