ప్రయాగరాజ్ లో ఆమె పూసలు, దండలు అమ్ముతున్న సమయంలో ఆమెతో మాట్లాడుతున్న వ్యక్తులు తీసిన వీడియోలు ఇంటర్నెట్ లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కేవలం అతి తక్కువ సమయంలోనే ఆమె జాతీయ స్థాయిలో ఫేమస్ అయ్యింది. కుంభమేళాకు వెళ్ళిన ప్రతి ఒక్కరు ఆమె ఎక్కడుందని తెలుసుకొని వెళ్లి సెల్ఫీలు దిగడం, వీడియోలు తీసుకోవడం ప్రారంభించారు. కుంభమేళాలో ఆమెను చాలా మంది ఇబ్బంది పెట్టడంతో మోనాలిసా తిరిగి ఇంటికి వెళ్లిపోయిందని వార్తలు సైతం వస్తున్నాయి.
అయితే యూపీలోని ఆమె ఇల్లు ఎలా ఉందో తెలిపే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. తన ఇంటి ముందు నిల్చోని తన బాధ చెప్పుకుంటూ కనిపించింది. కాగా, అదే సమయంలో ఈ మత్తు కళ్ళ సుందరి మోనాలిసాకు సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఇప్పటికే ఓ బాలీవుడ్ దర్శకుడు మనోజ్ మిశ్రా ఆమెకు సినిమాలలో అవకాశాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అంతేకాకుండా రామ్ చరణ్ - బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆర్సి16 లో కూడా మోనాలిసాకు అవకాశం ఇవ్వబోతున్నట్లుగా ప్రచారాలు సాగుతున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఆర్సి 16 అనే వర్కింగ్ టైటిల్ పేరుతో రాబోతున్న ఈ సినిమాలో మోనాలిసాకు ఎలాంటి పాత్ర ఇస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం మోనాలిసాకు సినిమా అవకాశాలు ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుందనే ప్రచారాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి.