ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె తన పెళ్లి, విడాకుల గురించి ఎన్నోఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. మేము అనుకోకుండా కనెక్ట్ అయ్యామని.. నాది లవ్ మ్యారేజ్ అని, పెద్దలు కుదించిన పెళ్లి అని రెండు విధాలుగాను చెప్పలేనంటూ వివరించింది. అనుకోకుండా కనెక్ట్ అయ్యాం.. మంచితనం చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. నా భర్త ఓ ప్రొడ్యూసర్. ఓ సినిమా తీసి కోట్లు నష్టపోయారు. అప్పులు ఎక్కువ అవడంతో డిప్రెషన్ లోకి వెళ్లి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. తర్వాత ఆయనే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి అప్పు తీర్చేశారు. అయితే అప్పు అప్పు తీర్చడానికే నేను సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాను అంటూ పుకార్లు వచ్చాయి. వాటిలో ఎంత మాత్రం నిజం లేదంటూ వివరించింది.
సినిమా మీద ఇష్టంతో మాత్రమే నేను రీఎంట్రీ ఇచ్చాను. అప్పట్లో మా ఆయన సినిమాలు కొన్ని రోజులు మానేయి అని చెప్పారు. సరే అని దూరంగా ఉన్నా. అంతే ఇప్పుడు నేను మూవీస్ లోకి తిరిగి వచ్చేసా. మా ఇద్దరి మధ్య పెద్ద సమస్యలు ఏమీ లేవు అంటూ వివరించింది. ఎంతో సరదాగా ఉంటూనే విడిపోయామని.. నేను సినిమాల్లోకి వచ్చేసా తన బిజినెస్ లోకి తను వెళ్లిపోయారంటూ చెప్పుకొచ్చింది. కాగా మేమిద్దరం విడాకులు తీసుకోలేదని.. కాకుంటే వేరువేరుగా ఉంటున్నాం.. పిల్లలు నాతోనే ఉంటున్నారు అంటూ వివరించింది ఆమని. ప్రస్తుతం ఆమని చేసిన కామెంట్స్ వైరల్ గా మారడంతో వీరిద్దరికి విడాకులు కాలేదా.. మరి ఏ కారణాలతో వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారో అంటూ పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.