అలాగే హను రాఘవపూడి తో పౌజి అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు .. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు .. అలాగే సలార్2 , కల్కి 2 సినిమాలతో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు .. ఇలా వరుస పాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నాడు. మరి అలాంటి ప్రభాస్‌కు టాలీవుడ్ లో తొలి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు శోభన్ .. ఈయన తెరకెక్కించిన వర్షం సినిమాతోనే ప్రభాస్ స్టార్ హీరోగా మారాడు.ఇక వర్షం సినిమాలో త్రిష హీరోయిన్ గా గోపీచంద్ విలన్ గా నటించిన ఈ సినిమా ప్రభాస్ మార్కెట్ ని కూడ ఓ రేంజ్ లో పెంచగా లేటేస్ట్ గా అయితే ఈ సినిమా విషయంలో ఓ ఆసక్తికర నిజం బయటకు వయ్యింది.
ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా త్రిష నటించిగా వారిద్దరి కెమిస్ట్రి సినిమాల్లో పెద్ద హైలైట్ గా నిలిచింది. అయితే అసలు ఈ సినిమాకి మొదట ప్రభాస్ కు జంటగా హీరోయిన్గా అనుకున్నది త్రిషాని కాదట. ఆమె ప్లేస్ లో మొదట అప్పటి యంగ్ హీరోయిన్ అదితి అగర్వాల్ నీ అనుకున్నారట. అల్లు అర్జున్ తో "గంగోత్రి " సినిమాలో మెరిసిన ఈ నటిని మొదటిగా అనుకోగా తర్వాత పలు కారణాల చేత ఆమె స్థానంలో త్రిష వచ్చి చేరింది. ఇక తర్వాత సినిమా వచ్చి ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే.