అయితే ఇంత పాపులారిటీ దక్కించుకున్న.. ఈ కథను బాలకృష్ణ గతంలోనే నటించారు . కళాతపస్వి కే.విశ్వనాధ్ డైరెక్షన్‌లో 1984 జూలై 27న జననీ జన్మభూమి సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే . ఈ సినిమా ప్రేక్షకుల్లో అంతగా కనెక్ట్ కాలేదు . బాలకృష్ణ హీరో గా సుమలత హీరోయిన్గా నటించిన ఈ సినిమా కథ శ్రీమంతుడు సినిమాను పోలి ఉంటుంది. అయితే ఈ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా రావడంతో అప్పటిల్లో ఫ్లాప్ గా నిలిచింది ..
జననీ జన్మభూమి మూవీలో బాలకృష్ణ .. సుమలత ను ప్రేమించి ఆమె సొంత ఊరు తెలుసుకొని ఆ ఊరికి వెళ్తాడు . అక్కడ సమస్యలు , దుర్మార్గ చేష్టలు అన్నింటిని అరికడతాడు . అప్పుడు సక్సెస్ కానీ లైన్‌ని .. కమర్షియల్ ఎలిమెంట్స్ నుంచి కొరటాల శివ శ్రీమంతుడు సినిమాగా ఇప్పటి ప్రేక్షకుల అంచనాలకు అందేలా అద్భుతంగా తెరకెక్కించాడు . ఈ విషయాన్ని స్వయంగా కొరటాల శివ మాట్లాడుతూ అప్పటి ఈ అద్భుతమైన లైన్‌ని ఇప్పుడు జనానికి నా స్టైల్ లో గుర్తు చేయాలనిపించింది అంటూ వివరించాడు. ప్రస్తుతం బాలకృష్ణ నటించిన ఈ లైన్ ని శ్రీమంతుడు సినిమాగా తెరకెక్కించారని న్యూస్ వైరల్ అవ్వడంతో అంత షాక్ అవుతున్నారు .